ఆ విమాన శిథిలాలు అక్కడే దొరకవచ్చు !
వాషింగ్టన్ : రెండేళ్ల క్రితం ఆదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన శకలాలు పశ్చిమ ఆఫ్రికా తీరంలో దొరికే అవకాశం ఉందని ఎన్బీసీ వార్తా సంస్థ గురువారం వాషింగ్టన్లో తన నివేదికలో వెల్లడించింది. ఆ విమాన శకలాలు ముంజాబిక్, మెడాగస్కర్ మధ్య లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సదరు ప్రాంతంలో ఆ విమానానికి సంబంధించిన శిథిలాలకు సంబంధించిన చిత్రాలను యూఎస్, మలేషియా, ఆస్ట్రేలియాన్ నావికులు గుర్తించినట్లు తెలిపింది.
ఇదే ప్రాంతంలో ఎంహెచ్ 370 కి చెందిన పోడవైన విభాగంకు చెందిన వస్తువును ఎన్బీసీ పేర్కొంది. అయితే ఈ నివేదికను రాయిటర్స్ మాత్రం ధృవపరచలేదు. మొజాంబిక్ అధికారులు కూడా సదరు ప్రాంతాంలో విమాన శిథిలాలు దొరికినట్లు సమాచారం లేదని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
2014 మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన ఇంత వరకు ఆ విమానం జాడ దొరకలేదు. దీంతో అదృశ్యమైన విమానం మిస్టరీ ఎప్పటికీ వీడేనో.