అదృశ్యమైన విమానం జాడ ఒక్క సెకండ్లోనా.... ఎట్లా?
గత నెలలో అదృశ్యమైన మలేసియా విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతునే ఉన్నాయని ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ వెల్లడించారు. విమాన జాడ కోసం ఇతరదేశాల సంపూర్ణ సహాయ సహకారాలు తీసుకుంటున్నామని తెలిపారు. తానే దేశ ప్రధాని అయి ఉంటే అదృశ్యమైన విమానం జాడ ఒక్క నిముషంలో కనుక్కోనే వాడినంటూ మలేసియా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం వ్యాఖ్యలను నజీబ్ ఖండించారు.
అన్వర్ వ్యాఖ్యలు మతిలేనివిగా ఆయన అభివర్ణించారు. విమానం ఆచూకీ కోసం ఇప్పటికి చేయని ప్రయత్నం లేదని ఆయన మరోమారు స్పష్టం చేశారు. ఈ నెల 5న మలేషియా ప్రతిపక్ష నేత చైనా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ... తాను దేశ ప్రధాని అయి ఉంటే ఒక్క నిముషంలో అదృశ్యమైన విమానం జాడ కనిపెట్టేవాడి నంటూ చెప్పారు. ఆ వ్యాఖ్యపై ప్రధాని నజీబ్ రజాక్పై విధంగా స్పందించారు.
2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఇప్పటికి ఆ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో విమానం జాడ కనుగోనడంలో మలేసియా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రయాణికుల బంధువులతో పాటు స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదృశ్యమైన విమానంలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్న విషయం విదితమే.