సూపర్ స్టార్‌ ఇంటికి దేశాధినేత | Malaysian Prime Minister Najib Razak meets Rajnikanth | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్‌ ఇంటికి దేశాధినేత

Published Fri, Mar 31 2017 12:12 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

సూపర్ స్టార్‌ ఇంటికి దేశాధినేత

సూపర్ స్టార్‌ ఇంటికి దేశాధినేత

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ నివాసానికి శుక్రవారం ఓ విశిష్ట అతిథి వచ్చారు. రజనీని చూసేందుకు ఏకంగా ఓ దేశాధినేత వచ్చారు. భారత పర్యటనకు వచ్చిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్.. రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. మలేసియా ప్రధాని మర్యాదపూర్వకంగా రజనీ ఇంటికి వెళ్లి కలసినట్టు సమాచారం.

ఈ భేటీ అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. కొన్నాళ్ల క్రితం మలేసియాలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నానని, అప్పుడు నజీబ్ రజాక్‌ను కలవలేకపోయానని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆయన తనను కలిసేందుకు వచ్చారని తెలిపారు. మలేసియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని ప్రధాని నజీబ్‌ తనను కోరలేదని, ఇవన్నీ ఊహాగానాలేనని అన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రజనీ నివాసానికి వెళ్లారు.

రజనీకాంత్‌కు దేశంలోనే గాక శ్రీలంక, జపాన్, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో అభిమానులు ఉన్నారు. రజనీ సినిమాలను అక్కడ బాగా చూస్తారు. రజనీ సినిమా విడుదల రోజున విదేశాల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఆయన విదేశాలకు షూటింగ్‌లకు వెళ్లినపుడు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కలవడంతో పాటు విందు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement