
చెన్నై(తమిళనాడు): పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన మృతికి నటుడు రజనీకాంత్ కాస్త ఆలస్యంగా సంతాపం వ్యక్తం చేశారు. అందుకు కారణం లేకపోలేదు. పునీత్‌రాజ్‌కుమార్ మరణానికి ముందు రోజే రజినీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరా రు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈనేపథ్యంలో బుధవారం సంతాపం తెలిపారు. దీని గురించి రజినీకాంత్ హూట్ యాప్‌లో మాట్లాడుతూ.. ‘‘నువ్వు లేవన్న విషయాన్నే జీరి్ణంచుకోలేకపోతున్నాను పునీత్.. రెస్ట్ ఇన్ పీస్ మై చైల్డ్’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment