ప్రధానిని అరెస్టు చేయాలని విద్యార్థుల భారీ ర్యాలీ
కౌలాలంపూర్: మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ను అరెస్ట్ చేయాల్సిందిగా విద్యార్థులు బారీ ర్యాలీని నిర్వహించారు. పోలీసుల నిషేధాజ్ఞలను లెక్కచేయక దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఆ దేశ రాజధాని కౌలాంలపూర్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో సమావేశమయ్యారు. నగరం మొత్తం ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. కరపత్రాలను పంచారు. గత నెలలో ప్రధాని మలేషియా ఖజానా నుంచి 3.5 మిలియన్ల డాలర్లను కొల్లగొట్టి అమెరికాలోఆస్తులను కొనుగోలు చేశారని యూఎస్ న్యాయ శాఖ నిర్ధారించింది. 700 మిలియన్ డాలర్లు మలేషియా అధికారుల బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా చేరాయని కోర్టు నిర్ధారించింది. దీంతో ఆదేశంలో ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి.