
సాక్షి, కర్నూలు: జిల్లాలోని డోన్ పట్టణంలో పీఏసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. శాంతి భద్రతలు కాపాడాలంటూ బుగ్గనతోపాటు పార్టీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. అరాచక శక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేశారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం రౌడీయిజాన్ని, హత్యా రాజకీయాలను, భూ కబ్జాలను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. డోన్‌లో హత్యా రాజకీయాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment