అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం | Buggana Rajendranath Meeting in Kurnool | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం

Published Mon, Mar 4 2019 12:09 PM | Last Updated on Wed, Jul 10 2019 8:16 PM

Buggana Rajendranath Meeting in Kurnool - Sakshi

మాట్లాడుతున్న పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, హాజరైన వైఎస్సార్‌సీపీ అనుబంధ సంఘాల నాయకులు

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని ఆ పార్టీ మేనిఫెప్టో కమిటీ సభ్యులు, డోన్‌ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్‌ సంజీవకుమార్‌ తెలిపారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో రూపకల్పన కోసం జిల్లాలోని పార్టీ 19 అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..మేనిఫెస్టోలో రైతులకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు.  గిట్టుబాటు ధరలు, ధరల స్థీరీకరణ నిధి, పెండింగ్, నూతన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి కోసం సిఫారసు చేయనున్నట్లు చెప్పారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌తోపాటు ఇతర ప్రాజెక్టుల నుంచి సమీపంలోని చెరువులకు నీటిని నింపేందుకు కృషి చేస్తామన్నారు. 

వేదవతి, గుండ్రేవుల, రాజోలిబండ డైవర్షన్‌ స్కీంలతోపాటు ఎల్‌ఎల్‌సీ పైపులైన్‌ పనులను కేవలం ఎన్నికల స్టంట్‌గా సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని విమర్శించారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే వాటిని పూర్తి చేయించడానికి కృషి చేస్తామన్నారు. మేనిఫెస్టోలో మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.  వ్యవసాయం, అనుబంధ రంగాలు, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు సిఫారసులు చేయనున్నట్లు చెప్పారు. యువతీ, యువకులకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నివేదించనున్నట్లు తెలిపారు. అనంతరం పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని క్రోడీకరించిన కమిటీ సభ్యులు నివేదిక రూపంలో రాష్ట్ర కమిటీకి దృష్టికి తీసుకెళ్లన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చెన్నకేశవరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మురళీకృష్ణ, ఆళ్లగడ్డ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి(నాని), చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి, తోట కృష్ణారెడ్డి, ఎస్‌ఏ రెహమాన్, సీహెచ్‌ మద్దయ్య, రుద్రగౌడ్, గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, హబీబుల్లా, బుట్టా రంగయ్య, కరుణాకరరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, భాస్కరరెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, కొనేటి వెంకటేశ్వర్లు, మహిళలు శశికళ, రేణుకమ్మ, వై.సుధా, విజయకుమారి, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement