జగన్‌ వస్తే ప్రతి పేదవాడికీ సంక్షేమ ఫలాలు | Buggana Rajendranath Ravali Jagan Kavali Jagan in Kurnool | Sakshi
Sakshi News home page

జగన్‌ వస్తే ప్రతి పేదవాడికీ సంక్షేమ ఫలాలు

Published Mon, Feb 25 2019 9:06 AM | Last Updated on Wed, Jul 10 2019 8:16 PM

Buggana Rajendranath Ravali Jagan Kavali Jagan in Kurnool - Sakshi

స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

డోన్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతిపేదవాడికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో భాగంగా ఆయన  ఆదివారం పట్టణంలోని 9వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల్లాంటి తొమ్మిది పథకాలను వివరించారు. ఈ పథకాల వల్ల ప్రతి కుంటుబానికి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని భరోసా ఇచ్చారు. పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్న మద్యంఅమ్మకాలను రాష్ట్రంలో సమూలంగా నిర్మూలిస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్లు, సామాజిక వర్గాల పెన్షనర్ల అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, పింఛన్‌ నెలకు రూ.2 వేల నుంచి రూ.3వేల పెంపు, బడికి పంపే ప్రతి విద్యార్థి తల్లి బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ తదితర పథకాలతో సుపరిపాలన అందిస్తామన్నారు.   

ప్రజా ధనం దోపిడీ..
నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రజా ధనాన్ని టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని ఎమ్మెల్యే బుగ్గన ఆరోపించారు. ప్రతి పనుల్లోనూ పర్సెంటేజీలు వసూలు చేస్తూ, పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారన్నారు. మరుగుదొడ్ల బిల్లులను సైతం థర్డ్‌పార్టీ పేరుతో దిగమింగిన చరిత్ర స్థానిక టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. వంకలు, వాగులు, పోరంబోకు భూములతో పాటు ప్రైవేట్‌ వ్యక్తుల స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించి టీడీపీ నాయకులు బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు చిన్నకేశవయ్య గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జ్‌ మహేశ్వర రెడ్డి, పార్టీ నాయకులు జనార్దన్, రఫీ, బడేషా, హుసేన్, రబ్బాని, నరసింహలు, మండల, పట్టణ శాఖల అధ్యక్షులు మల్లెంపల్లె రామచంద్రుడు, కోట్రికె హరికిషన్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement