సాక్షి, కర్నూలు: కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయమని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ కంటివెలుగు పథకం మూడో దశను కర్నూలులో మంగళవారం సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆమోదయోగ్యమైన పరిపాలనను సీఎం జగన్ అందిస్తున్నారని ప్రశంసించారు. ప్రతీ విద్యార్థి ఇంగ్లీష్‌లో చదువుకోవాలనేది సీఎం జగన్ తపన అని అన్నారు. పిల్లలను బడులకు పంపిస్తున్న తల్లులకు అమ్మఒడి ద్వారా భరోసా కల్పించారన్నారు. స్కూల్ పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక మెను రూపొందించనట్లు మంత్రి బుగ్గన వివరించారు.
రాజన్న కలలను నెరవేరుస్తున్నారు
దివంగత మహానేత రాజన్న కలలను సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కర్నూలులో మూడో దశ వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి .. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని అభివర్ణించారు. బలహీనవర్గాలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ అని మంత్రి జయరాం కొనియాడారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మాట వీద నిలబడే నాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. ఇచ్చిన ప్రతీ హామీని సీఎం నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
చదవండి:
అవ్వాతాతలకు వైఎస్సార్ కంటి వెలుగు
Comments
Please login to add a commentAdd a comment