TTP
-
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
-
ఇంకా రహస్య యుద్ధమే విధానమా?
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పాకిస్తాన్ లో దాదాపు 270 ఉగ్రదాడులు జరిగాయి. పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్–ఎ– తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) భయంకరమైన దాడులను చేస్తోంది. తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికీ, రాజకీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికీ ఒకవైపు పాకిస్తాన్ పోరాడుతుండగా... మరొకవైపు దేశంలో భద్రతా పరిస్థితి దిగజారుతోంది. అయినా పాకిస్తాన్ తన విదేశాంగ విధాన సాధనంగా రహస్య యుద్ధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. కానీ తన సొంత గడ్డపై తీవ్రవాదం నుండి నిరోధక శక్తిని కోరుకుంటోంది. ఉగ్రవాదం, టీటీపీ విస్తరణ ఆందోళనకరమైనవి. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కే కాకుండా ఇవి దక్షిణాసియాకు కూడా తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయి. పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలోని బజౌర్ జిల్లాలో జూలై 30న జమీయత్ ఉలేమా– ఎ–ఇస్లాం ఫజల్ (జేయూఎల్–ఎఫ్) సమావేశంపై జరిగిన ఉగ్రదాడిలో 50 మందికి పైగా మరణించారు, దాదాపు 200 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఖురాసాన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) ప్రకటించింది. గతంలో కూడా జేయూఎల్–ఎఫ్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ స్టేట్ అనేక దాడులు చేసింది. ఈ దాడులకు ప్రధాన కారణాలలో ఒకటి, అఫ్గానిస్తాన్ తాలిబన్లతో జేయూఎల్–ఎఫ్‌కు ఉన్న అనుబంధం; మరొక కారణం, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యానికి జేయూఎల్–ఎఫ్ ఇస్తున్న మద్దతును ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేకించడం అని చెప్పాలి. బలూచిస్థాన్ లోని ఝోబ్ ఆయుధాగారంపై ఇటీవల జరిగిన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాకిస్తాన్ ఉగ్రవాద ముఖచిత్రంలో తాజా ప్లేయర్ అయిన తెహ్రీక్– ఎ–జిహాద్ పాకిస్తాన్ (టీజేపీ) ఆ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. టీజేపీ, తెహ్రీక్–ఎ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో అనుబంధాన్ని కొనసాగిస్తోంది. టీటీపీ పాకి స్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తున్న భయంకరమైన సంస్థ. తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికీ, రాజకీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడానికీ ఒకవైపు పాకిస్తాన్ పోరాడుతుండగా... మరొకవైపు దేశంలో భద్రతా పరిస్థితి మరింత దిగజారుతోంది. గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఖైబర్ పఖ్తున్ ఖ్వా, బలూచిస్తాన్లలో టీటీపీ దాడులు పెరిగాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే పాకిస్తాన్ లో దాదాపు 270 ఉగ్రదాడులు జరిగాయి. తాలిబన్లతో చెడిన మైత్రి అఫ్గానిస్తాన్‌తో పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2021 ఆగస్ట్‌లో కాబూల్‌ను తాలిబన్ స్వాధీనం చేసుకున్న తర్వాత మాజీ పౌర, సైనిక నాయకత్వం వ్యూహాత్మక విజయంగా భావించిన దానికి ఇది విరుద్ధంగా నడుస్తోంది. అమెరికా నిష్క్రమణ తర్వాత పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సంబంధాలలో రెండు సమస్యలు కీలకంగా ఉన్నాయి. మొదటిది, డ్యూరాండ్ రేఖను సరిహద్దుగా గుర్తించడానికి తాలిబన్లు విముఖత వ్యక్తం చేయడంతోపాటు, సరిహద్దుల్లో కంచె వేయడాన్ని వారు ప్రతిఘటించడం. రెండవది, మిలిటెంట్ గ్రూపునకు మద్దతు నిచ్చే స్థావరాన్ని విడిచిపెట్టమని పాకిస్తాన్ సైన్యం పదే పదే సందేశం పంపినప్పటికీ, టీటీపీని తాలిబన్ ప్రోత్సహిస్తోంది. పైగా కాబూల్‌లో ప్రాతినిధ్య పాలన ఓడిపోయిన తర్వాత టీటీపీ గణనీయంగా బల పడింది. తాలిబన్ తో టీటీపీ బలమైన సైద్ధాంతిక (వ్యూహాత్మక) కూటమిని పంచుకున్నందున ఇది ఊహించదగినదే. టీటీపీ అనేది అఫ్గాన్ తాలిబన్లకు సైద్ధాంతిక విస్తరణ. పైగా ఉగ్రవాదంపై అమెరికా సాగించిన యుద్ధ సమయంలో తాలిబన్లకు ఇది మద్దతునిచ్చింది. కాబట్టి తిరిగి సహాయం చేయడం కోసం టీటీపీకి తోడ్పాటును అందించాల్సిన బాధ్యత అఫ్గాన్ తాలిబన్లపై ఉంది. అయితే తాలిబన్లు తమ భూభాగంలో టీటీపీ ఉందనడాన్ని ఖండించారు. అంతేకాకుండా అఫ్గాన్ గడ్డపై దాడులను చేయరాదని పాకిస్తాన్ ను హెచ్చరించారు కూడా. అయినప్పటికీ, టీటీపీకి అఫ్గాన్ తాలిబన్లు మద్దతు ఇస్తున్నట్లు పాకిస్తాన్ సైన్యం గుర్తించింది. పైగా ఈ విషయంలో తదుపరి చర్యపై బలమైన ప్రకటనలను జారీ చేస్తోంది. ఝోబ్ దాడి తరువాత, ‘అఫ్గానిస్తాన్‌లో టీటీపీకి అందుబాటులో ఉన్న సురక్షిత స్వర్గ ధామాలు, కార్యాచరణకు చెందిన స్వేచ్ఛపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు’ పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. ఇటువంటి దాడులు సహించలేనివనీ, పాకిస్తాన్ భద్రతా దళాలు వీటిపై సమర్థవంతంగా ప్రతిస్పందిస్తాయనీ ప్రకటించింది. ఉ్రగ్ర సంస్థలు ఏకమయ్యే ప్రమాదం ఐఎస్ఐఎల్ (దాయెష్), అల్–ఖైదా, అనుబంధ గ్రూపులు, వ్యక్తులకు సంబంధించి... ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ‘ది ఎనలిటికిల్ సపోర్ట్ అండ్ శాంక్సన్స్ మానిటరింగ్ టీమ్’ సమర్పించిన 32వ నివేదిక టీటీపీ ఒక ప్రాంతీయ ముప్పుగా మారవచ్చని పేర్కొంది. ‘తాలిబన్ నియంత్రణలో దాడి ప్రయత్నాలను తప్పించు కుంటూ, అనేక రకాల విదేశీ సమూహాలు ఏకఛత్రంగా పనిచేస్తాయి లేదా ఐక్యమవుతాయి’ అని ఈ నివేదిక తెలిపింది. అయితే టీటీపీ గురించిన సైన్యం ప్రతిస్పందనపై పుష్కలమైన ఊహాగానాలు ఉన్నాయి. గత సంవత్సరం, పౌర, సైనిక ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు జారీ చేసింది. ఈ సందర్భంలో మూడు ఎంపికలను విశ్లేషించవచ్చు: ఒకటి: పాకిస్తాన్ ప్రభుత్వం టీటీపీని తిరిగి చర్చల బల్ల వద్దకు తీసుకువచ్చి కాల్పుల విరమణకు ప్రయత్నిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న గత ప్రభుత్వం టీటీపీ గ్రూప్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నించి 100 మందికి పైగా టీటీపీ ఖైదీలను విడుదల చేసింది. ఇది టీటీపీ గ్రూప్ బలాన్ని పెంచింది. ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాని డిమాండ్లపై రాజీ పడేందుకు టీటీపీ ఎలాంటి సంకేతాన్నీ చూపలేదు. తీవ్రవాద దాడుల పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ పదే పదే బాధ్యత వహించారని చెప్పవచ్చు. రెండు: అఫ్గాన్ తాలిబన్ ను పాకిస్తాన్ విశ్వాసంలోకి తీసుకుంటుంది. తరువాత గ్రూపును నియంత్రించే బాధ్యత తీసుకుంటుంది. అయితే తాలిబన్, టీటీపీల మధ్య బలమైన సంబంధాలు, తాలిబన్ నుండి టీటీపీ ప్రేరణ పొందడం, పైగా వారిని రోల్ మోడల్‌గా చూడటం ఈ అవకాశ సాధ్యా సాధ్యాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. అయితే, పాకిస్తాన్ లోని అస్థిర పరిస్థితులను బట్టి, ఇది అక్కడి పాలనా వ్యవస్థకు సాధ్యమైన ఎంపికగానే కనిపిస్తోంది. మూడు: టీటీపీని లక్ష్యంగా చేసుకుని ప్రతి–తిరుగుబాటు చేయడం. పాక్ మిలిటరీ ఇంతకుముందు 2014లో జర్బ్–ఎ–అజ్బ్, 2017లో రద్–ఉల్–ఫసాద్ వంటి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించింది. ఇవి టీటీపీ సంఖ్యను, ఉగ్రవాద దాడులను నిర్వహించగల దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయి. అయినప్పటికీ ఈ గ్రూప్ తనను తాను నిలబెట్టుకుని తాలిబన్ మద్దతుతో వృద్ధి చెందింది. అయితే నాలుగు కారణాల వల్ల పాక్ సైనిక ప్రతిస్పందనకు అవరోధం ఏర్పడింది. గిరిజన ప్రాంతాల్లో గణనీయమైన స్థానభ్రంశాలు చోటు చేసుకోవడం; భయంకరమైన ఆర్థిక సంక్షోభం (దాంతో పాటు వరదల వల్ల కలిగిన దుఃస్థితి); ఏ సైనిక చర్య అయినా దేశంపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతర చేయడం; అఫ్గాన్ తాలిబన్ల నుండి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు అపారంగా ఉండటం. కుట్రలో భాగమా? అయితే టీటీపీ గ్రూప్ కార్యకలాపాలను నియంత్రించకపోవడం పాక్ సైన్య ఉద్దేశపూర్వక కుట్ర చర్యలో భాగమనీ, ఉగ్రవాద వ్యతిరేక సహాయాన్ని అమెరికా నుంచి ఆకర్షించడానికే ఇలా చేస్తున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఏమైనా పాక్ సైన్యం తన ఎంపికలను అప్రమత్తంగా పరిశీలిస్తుండగా, పాకిస్తాన్ మాత్రం తన వ్యూహాత్మక ఎంపికల బురదలో చిక్కుకుందనేది వాస్తవం. పాకిస్తాన్ తన విదేశాంగ విధాన సాధనంగా రహస్య యుద్ధానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. కానీ తన సొంత గడ్డపై తీవ్రవాదం నుండి నిరోధక శక్తిని కోరుకుంటోంది. ఉగ్రవాదం, టీటీపీ విస్తరణ ఆందోళనకరమైనవి. సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ కే కాకుండా ఇవి దక్షిణాసియాకు కూడా తీవ్రమైన భద్రతా సవాళ్లను విసరనున్నాయి. శాలినీ చావ్లా వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే
ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ పాలన మొదలయ్యాక పాకిస్తాన్లో తెహ్రిక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) మరింత పుంజుకున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)కి చెందిన మానిటరింగ్ కమిటీ ఒక నివేదికలో తెలిపింది. పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాలపై పట్టు కోసం ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు టీటీపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని ఈ నివేదిక వెల్లడించింది. కాబూల్ పతనం అనంతరం ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సమాచారం. టీటీపీ సరిహద్దు ఆవల నుండి తాలిబాన్ మద్దతు పొందుతోంది. పాకిస్తాన్‌పై పట్టు బిగించడంలో టీటీపీ ఊపందుకుంటున్నట్లు సభ్య దేశాల అంచనా. ఆఫ్ఘానిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం ద్వారా ధైర్యాన్ని పొందిన టీటీపీ ఇప్పుడు పాకిస్తాన్లో భూభాగంపై నియంత్రణను తిరిగి స్థాపించాలనే ఆశయంతో పనిచేస్తున్నదని నివేదిక తెలియజేస్తున్నది. బలోపేతమవుతున్న టీటీపీ పాకిస్తాన్లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడులు టీటీపీ బలోపేతాన్ని రుజువు చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోని ముఖ్య లక్ష్యాలు, పట్టణ ప్రాంతాల్లో సాఫ్ట్ లక్ష్యాలపై టీటీపీ దృష్టి సారిస్తోందని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘానిస్తాన్‌లో టీటీపీ యధేచ్ఛగా తన కార్యకలాపాలను కొనసాగిస్తే అది ప్రాంతీయ ముప్పుగా మారుతుందని సభ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. యూఎన్‌ఎస్‌సీలోని కొన్ని సభ్య దేశాలు కూడా టీటీపీ తిరిగి పుంజుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్‌లో టీటీపీ వివిధ విదేశీ సంస్థలతో అనుబంధం ఏర్పరుచుకోవచ్చని, సమీప భవిష్యత్తులో అల్-ఖైదాతో విలీనమయ్యే అవకాశం కూడా ఉండవచ్చని నివేదిక తెలిపింది. టీటీపీకి అల్-ఖైదా మార్గనిర్దేశం అల్-ఖైదా ఇప్పటికే టీటీపీకి మార్గనిర్దేశం చేస్తోందని, పాకిస్తాన్ లోపల లక్షిత ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి సహాయం చేస్తున్నదని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘానిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో నిషేధిత సంస్థ ఈస్ట్ టర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ (ఈటీఐఎం)శిక్షణా శిబిరాలను టీటీపీ నాయకులు ఉపయోగిస్తున్నారని, ఇది తాలిబాన్ పాలన కింద వివిధ సమూహాల మధ్య సమన్వయం, మద్దతును సూచిస్తున్నదని నివేదిక తెలిపింది. 20కిపైగా ఉగ్రసంస్థలకు ఆఫ్ఘానిస్తాన్ అండ? తీవ్రవాదం విషయంలో ఆఫ్ఘానిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. దాని పొరుగున ఉన్న పాకిస్తాన్లో అశాంతిని వ్యాప్తి చేయడానికి పనిచేస్తున్న 20కి మించిన ఉగ్రవాద సమూహాలకు ఆఫ్ఘానిస్తాన్ సురక్షితమైన ప్రాంతంగా ఉంది. తాలిబాన్, టీటీపీ, అల్ ఖైదాలు సైద్ధాంతికంగా కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయనేది వాస్తవం. ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్, అల్ ఖైదాలు రహస్యంగా పనిచేస్తున్నాయి. అల్ ఖైదా తన కార్యాచరణ సామర్థ్యాన్ని రహస్యంగా పునర్నిర్మించుకుంటూ, నూతనంగా యువతను రిక్రూట్ చేయడానికి ఆఫ్ఘానిస్తాన్‌ను రవాణా కేంద్రంగా ఉపయోగిస్తోంది. ప్రాంతీయ తీవ్రవాద గ్రూపుల సహకారంతో.. అల్ ఖైదా నాయకులు ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్న నాన్-ఆఫ్ఘన్ మూలాలు కలిగిన ప్రాంతీయ తీవ్రవాద గ్రూపులతో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, జమాత్ అన్సరుల్లా సహకారంతో మధ్య ఆసియాతో పాటు ఇతర దేశాలలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆ నివేదికలో పేర్కొంది. ఇది కూడా చదవండి: పాపం.. జపాన్ భవిష్యత్తు అలా ఏడ్చింది -
తిరుమల: మహాసంప్రోక్షణ ప్రారంభం
సాక్షి, తిరుమల: శ్రీవరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. డిసెంబరు 10న మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 20 మంది ప్రముఖ రుత్వికులు 13హోమగుండాలలో విశేష హోమాలు నిర్వహించనున్నారు. నేడు ఉదయం 7.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాకర్షణ : రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. డిసెంబరు 7, 8, 9వ తేదీల్లో : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరల రాత్రి 8 నుండి 10 గంటల వరకు విశేషహోమాలు, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబరు 10న: ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో బాలాలయ మహాసంప్రోక్షణము వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారు తిరు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. వరాహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయబడిన రాగి రేకులు అమర్చేందుకు బాలాలయం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు భక్తులకు వరాహస్వామి వారి మూల విరామూర్తి దర్శనం ఉండదు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరుగు వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. -
ఈ ఉగ్ర గ్రూపులకు పాకిస్తానీలే బాస్‌లు
ఐక్యరాజ్యసమితి: భారత ఉపఖండంలో కార్యకలాపాలు సాగిస్తున్న అల్‌కాయిదా వంటి ఉగ్ర సంస్థలకు పాకిస్తానీ జాతీయులే నాయకత్వం వహిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవాంట్–ఖొరాసాన్ (ఐఎస్ఐఎల్–కె), తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) తదితర ఉగ్రసంస్థల నేతల పేర్లను ఆంక్షల జాబితాలో చేర్చలేదని తెలిపింది. ఐఎస్ఐఎల్, అల్‌కాయిదా, వాటి అనుబంధ వ్యక్తులు, ఆస్తులపై ఐరాస ఏర్పాటు చేసిన ఆంక్షల సమీక్ష కమిటీ ఈ విషయాలు వెల్లడించింది. ఐఎస్ఐఎల్–కె అధిపతి అస్లాం ఫరూఖీ అలియాస్ అబ్దుల్లా ఒరాక్జాయ్‌తోపాటు మాజీ అధినేత జియా ఉల్హక్ అలియాస్ అబూ ఒమర్ ఖొరాసానీ, అల్‌కాయిదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) నేత ఒసామా మహ్మూద్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వారేననీ,వీరి పేర్లు ఆంక్షల జాబితాలో లేవని ఆ నివేదిక పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లోని అతిపెద్ద ఉగ్ర ముఠా టీటీపీ చీఫ్ అమిర్ నూర్ వలీ మెహ్సూద్ కూడా పాకిస్తాన్‌కు చెందిన వాడేనని తెలిపింది. -
అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా ఉన్నారు: బుగ్గన
సాక్షి, కర్నూలు: జిల్లాలోని డోన్ పట్టణంలో పీఏసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. శాంతి భద్రతలు కాపాడాలంటూ బుగ్గనతోపాటు పార్టీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించారు. అరాచక శక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేశారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం రౌడీయిజాన్ని, హత్యా రాజకీయాలను, భూ కబ్జాలను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. డోన్‌లో హత్యా రాజకీయాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. -
అరాచకం: మహిళపై టీడీపీ రేషన్ డీలర్ దాడి
సాక్షి, కర్నూలు(ఆదోని టౌన్): పేదల బియ్యాన్ని స్వాహా చేయటంపై అధికారులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో అధికార పార్టీకి చెందిన రేషన్ డీలర్, అతడి సోదరులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమాలపై ఫిర్యాదు చేశారనే కక్షతోనే టీడీపీకి చెందిన అంజినయ్య గ్రామంలో రేషన్ డీలర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కార్డుదారులకు రేషన్ సక్రమంగా ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు అతడిపై ఆరోపణలున్నాయి. డీలర్ అక్రమాలపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు స్థానిక తహశీల్దార్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వీఆర్వో రామాంజనేయులు ఆదివారం గ్రామంలో విచారణ జరపగా రేషన్ డీలర్ బియ్యం ఇవ్వటం లేదని వంద మందికిపైగా కార్డుదారులు తెలిపారు. ఇదే నివేదికను వీఆర్వో తహసీల్దార్‌కు సమర్పించారు. ఏపీ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె క్రిష్ణమ్మ కూడా సోమవారం గ్రామాన్ని సందర్శించి డీలర్ అక్రమాలు, తూకాల్లో మోసాలపై ఆరా తీశారు. దీన్ని జీర్ణించుకోలేని డీలర్ అంజనయ్య, అతడి సోదరులు నాగరాజు, కేశవ్, ఈరన్న గ్రామస్తులతో గొడవకు దిగారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ గొల్ల లక్ష్మి అనే మహిళను దుర్భాషలాడారు. ఆమెపై భౌతిక దాడికి దిగి కొట్టటంతో జాకెట్ చిరిగిపోయింది. ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపుతామంటూ బెదిరించారు. దాడితో అస్వస్థతకు గురైన బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. నడుము భాగం దెబ్బ తిన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు, మీడియా వద్ద బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వేడుకుంది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రపంచ టెర్రరిస్ట్‌గా టీటీపీ చీఫ్
ఇస్లామాబాద్: పెషావర్ స్కూల్ దాడి ప్రధాన సూత్రధారి, తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) చీఫ్ ముల్లా ఫజలుల్లాను టెర్రరిస్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పర్యటన అనంతరం పాక్ ఈ ప్రకటన చేయటం విశేషం. టీటీపీ చీఫ్ ముల్లా ఫజలుల్లా శనివారం హతమైనట్టు పాకిస్తాన్ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పెద్ద దుమారం రేపుతోంది. దీంతో పాటు టీటీపీ, జేయూడీతో సహా మొత్తం పది ఉగ్రవాద సంస్థలపై కూడా పాక్ నిషేధం విధించే యోచనలో ఉంది. -
వైఎస్ఆర్ సీపీలో చేరికలు
సీతానగరం, న్యూస్‌లైన్: మండలంలోని గుచ్చిమి, జోగింపేట గ్రామాల్లో టీటీపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలు కుటుంబాలు బుధవారం వైఎస్ఆర్ సీపీలో చేరాయి. ఈ మేరకు పార్టీ నాయకులు హరిగోపాలరావు, పి.నాగభూషణరావు, సర్పంచ్ మర్రాపు శ్రీదేవి, పోల తాతబాబులు మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉన్న బొబ్బిలి రాజులకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా గుచ్చిమి నుంచి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మరిశర్ల సత్యవతమ్మ, అప్పలనాయుడు, లక్షున్నాయుడు, ముసలినాయుడు, ఆనం ద్, అప్పలనాయుడు, శ్రీ ను, కామేశ్వరరావుతో సహా 40 కుటుంబాలు పార్టీలో చేరాయి. అలాగే జోగింపేట నుంచి మాజీ సర్పంచ్ పోల ఈశ్వరనారాయణ, శ్రీనివాసరావులతో సహా 30 కుటుం బాలు వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీ తరఫున జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని గెలిపించాలని డీసీసీబీ డెరైక్టర్ బి.చిట్టిరాజు, తెంటు వెంకటప్పలనాయుడు, ధనుంజయ్‌నాయుడులు కోరారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఎన్.రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు అంబటి కృష్ణంనాయుడు, పి.వెంకటనాయుడు, సబ్బాన శ్రీనివాసరావు, గోపాల్, సత్యం తదితరులుపాల్గొన్నారు. -
నీచ రాజకీయాలకు ఓట్లేయరు
చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే గతి ప్రజాబాటలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : జనంలో జగన్‌కు ఉన్న ఆదరణను తగ్గించేందుకు చంద్రబాబునాయుడు ఎన్ని నీచపు రాజకీయాలు చేసినా ప్రజలు టీడీపీకి ఓట్లు వేయరని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పరిధిలోని తిలక్‌రోడ్డు, దొడ్డాపురం వీధిలో పార్టీ మహిళా నగర కన్వీనర్ చెలికం కుసుమ, బోయళ్ళ రాజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. సాయంత్రం తిమ్మినాయుడుపాళెం పరిధిలోని రెడ్డిభవనం వద్ద ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు జనంలో జగన్‌కు ఆదరణ పెరుగుతోందన్నారు. దీనిని చూడలేక ఎలాగైనా అధికారంలోకి రావాలన్న నీచపు ఆలోచనతో చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో జగనన్న మోగించిన ‘వైఎస్ఆర్ జన భేరి’ సభకు వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబునాయుడు గుండెల్లో దడ పుట్టిందన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు బూటు దెబ్బలు, ప్రజలకు లాఠీదెబ్బలు తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. మంచి చేసిన వాళ్లను గుండెల్లో పెట్టుకుని పూజించడం, చెడు చేసిన వాళ్లను చీపుర్లతో తరిమికొట్టడం జనానికి తెలుసన్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఏ నాయకుడు చేయలేనన్ని అభివృద్ధి పనులు చేసిన మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని గుర్తు చేశారు. ఒక్క రోజు కూడా రాష్ట్ర సమైక్యత కోసం కట్టుబడి ఉండని కిరణ్, చంద్రబాబుకు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. తండ్రి ఆశయాల కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ధిక్కరించి, పదవికి రాజీనామా చేసిన ఘనుడు జగనన్న అని గుర్తు చేశారు. ఆయన నిరంతరం ప్రజల అభ్యున్నతికే శ్రమిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాదరావు, పార్టీ నాయకులు ఎస్కే. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, ఎంవీఎస్.మణి, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, తాలూరి ప్రసాద్, కట్టాగోపీయాదవ్, తిమ్మారెడ్డి, రాఘవులునాయుడు, రాజేంద్ర, కన్నయ్య, నూరుల్లా, చాంద్‌బాషా, జనార్ధన్, పుణీత, గౌరి, శాంతారెడ్డి, శమంతకమణి పాల్గొన్నారు.