గల్లంతైన విమానం... తిరిగి వస్తుంది !
కాలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తు మొన్న అర్థరాత్రి అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం తిరిగి వస్తుందని మలేషియా పౌర విమానాయానశాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన విమానం తిరగి కౌలాలంపూర్ వస్తుందని మిలటరీ రాడార్ సూచనలు చేస్తుందని తెలిపారు. చైనా, బీజింగ్, వియత్నాం దేశాలతోపాటు అమెరికా 22 విమానాలు, 40 ఓడలను రంగంలోకి దిగి ఇప్పటికే గల్లంతైన విమానం కోసం అన్వేషణను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. విమాన ఆచూకీ కోసం కనుగొనే క్రమంలో ఇండోనేషియా సహకారాన్ని కూడా కోరామని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి తెలిపారు.
విమానం ఓ వేళ సముద్రంలో కూలిపోయి ఉంటే విమాన శకలాలు లేకుంటే ప్రయాణికుల వస్తువులు నీటిపై తేలియాడుతూ ఉండేవన్నారు. విమానం అదృశ్యమై 24 గంటలు గడిచిన అంటువంటి ఏవి సముద్రం నీటిపై కనిపించిన దాఖలాలు లేవని గాలింపు చేపట్టిన సిబ్బంది వెల్లడించారని తెలిపారు. అయితే విమాన ప్రయాణికుల జాబితాపై దృష్టి సారించామని, అందులో నకిలీ పాస్పోర్ట్లతో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. ఆ ఇద్దరిలో ఒకరిది ఇటలీ కాగా, మరోకరిది ఆస్ట్రేయా దేశానికి చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో కోలాలంపూర్ నుంచి శుక్రవారం అర్థరాత్రి విమానం బీజింగ్ బయలుదేరింది. రెండు గంటల అనంతరం ఆ విమానం మలేషియా విమానాశ్రయంలోని ఎటీసీ కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. విమానం అదృశ్యం కావడంతో ఆ ఇరుదేశాల ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తు గాలింపు చర్యలు చేపట్టారు. వియత్నాం సమీపంలో ఆ విమానం కూలిపోయిందని శనివారం వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే గాలింపు చర్యలలో ఎక్కడ ఎటువంటి శకలాలు లభ్యం కాకపోవడంతో మలేషియా పౌర విమానాయానశాఖ విమానం తప్పక తీరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విమానం అదృశ్యం కావడంతో ప్రయాణీకుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.