'ప్రమాదం కానే కాదు.. కుట్రపూరిత చర్యే' | Australia lashes out at Russia over Ukraine plane crash | Sakshi
Sakshi News home page

'ప్రమాదం కానే కాదు.. కుట్రపూరిత చర్యే'

Published Fri, Jul 18 2014 4:40 PM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

'ప్రమాదం కానే కాదు.. కుట్రపూరిత చర్యే'

'ప్రమాదం కానే కాదు.. కుట్రపూరిత చర్యే'

మెల్ బోర్న్: ఉక్రెయిన్ విమాన ప్రమాదంపై రష్యా స్పందించిన తీరుపై ఆస్త్రేలియా ప్రధాని టోని ఆబాట్ మండిపడ్డారు. 28 ఆస్ట్రేలియన్లతోపాటు, 298 మంది మృత్యువాత పడ్డిన విమాన ప్రమాదంపై రష్యా స్పందించిన తీరుపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అసంతృప్తిని వెళ్లగక్కింది.  
 
మలేషియా ఎయిర్ లైన్ MH17 కూలిన ఘటన ప్రమాదం కానేకాదని.. అదో నేరపూరిత చర్య అని అబాట్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ విమాన దుర్ఘటనపై ఆస్ట్రేలియా పార్లమెంట్ లో చర్చ చేపట్టారు. 
 
విమాన ప్రమాదం ముమ్మాటికి కుట్రపూరిత చర్యే.. ప్రమాదం కాదని స్పీకర్ కు టోని అబాట్ వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని అబాట్ విజ్క్షప్తి చేశారు. ప్రమాద ఘటనపై రష్యా రాయబారి స్పందించిన తీరుపై ఆయన మండిపడ్డారు. 
 
విమానాన్ని కూల్చివేతకు పాల్పడింది రష్యాకు చెందిన తిరుగుబాటుదారులేనని అబాట్ ఆరోపించారు. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేవేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement