malaysian ariline
-
'ప్రమాదం కానే కాదు.. కుట్రపూరిత చర్యే'
మెల్ బోర్న్: ఉక్రెయిన్ విమాన ప్రమాదంపై రష్యా స్పందించిన తీరుపై ఆస్త్రేలియా ప్రధాని టోని ఆబాట్ మండిపడ్డారు. 28 ఆస్ట్రేలియన్లతోపాటు, 298 మంది మృత్యువాత పడ్డిన విమాన ప్రమాదంపై రష్యా స్పందించిన తీరుపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అసంతృప్తిని వెళ్లగక్కింది. మలేషియా ఎయిర్ లైన్ MH17 కూలిన ఘటన ప్రమాదం కానేకాదని.. అదో నేరపూరిత చర్య అని అబాట్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ విమాన దుర్ఘటనపై ఆస్ట్రేలియా పార్లమెంట్ లో చర్చ చేపట్టారు. విమాన ప్రమాదం ముమ్మాటికి కుట్రపూరిత చర్యే.. ప్రమాదం కాదని స్పీకర్ కు టోని అబాట్ వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని అబాట్ విజ్క్షప్తి చేశారు. ప్రమాద ఘటనపై రష్యా రాయబారి స్పందించిన తీరుపై ఆయన మండిపడ్డారు. విమానాన్ని కూల్చివేతకు పాల్పడింది రష్యాకు చెందిన తిరుగుబాటుదారులేనని అబాట్ ఆరోపించారు. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేవేసిన సంగతి తెలిసిందే. -
దేశాల పోరులో సామాన్యులే సమిధలా?
రాజ్యాల ఆధిపత్య పోరులో అమాయకుల ప్రాణాలు గాల్లోనే బూడిదయ్యాయి. దేశాల మధ్య రాజుకున్న విభేదాలు వందల మంది పౌరుల ప్రాణాలు బలి తీసుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్ ఆధిపత్య యుద్ధం ఆకాశాయానం చేస్తున్న 295 మంది అమాయక పౌరుల ప్రాణాలను తోడేసింది. రష్యా సరిహద్దుల్లో కొనసాగుతున్న సమరంలో విమాన ప్రయాణికులు పావులుగా మారి మృత్యువాత పడ్డారు. ఆదిమ కాలం నుంచి ఆధునిక యుగం వరకు రాజ్యాల పోరులో అమాయక పౌరులే బలవడం ఆనవాయితీగా మారిపోయింది. ఆధునికతకు శిఖరాగ్రమని చెప్పుకుంటున్న నేటి కాలంలోనూ పరిస్థితి మార్పు రాకపోవడం దురదృష్టకరం. ఇందుకు కారణాలనేకం. ఏదేమైనా చరిత్ర పుటల్లో మరో నరమేధం నమోదయింది. మలేసియా నాలుగు నెలల స్వల్ప కాలంలోనే రెండో విమాన ప్రమాదాన్ని చవిచూసింది. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం తప్ప మనమేం చేయగలం. విమాన దుర్ఘటన మృతులకు 'సాక్షి' సంతాపం తెలుపుతోంది. దీనికి కారణం ఉగ్రవాద దాడి అని భావిస్తున్నారా? దేశాల మధ్య పోరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి. -
'కూలిన విమానంలో భారతీయులు లేరు'
-
'కూలిన విమానంలో భారతీయులు లేరు'
న్యూఢిల్లీ: కూలిపోయిన మలేషియా విమానంలో భారతీయులు లేరని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. మరణించినవారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన విమానసిబ్బంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఇందులోని సమాచారం ఆధారంగా విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకోనున్నారు. మరోవైపు ఉక్రెయిన్ మీదుగా విమాన రాకపోకలను విమానసంస్థలు నిలిపేశాయి. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేశారు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ మృతి చెందారు. -
ఎంహెచ్ -17: పుతిన్ విమానాన్ని పేల్చబోయారా?
మలేషియా విమానాన్ని పేల్చింది ఎవరు? రష్యన్ దళాలే తమ సైనిక విమానాలను గత కొన్ని వారాలుగా లక్ష్యం చేసుకుంటున్నాయని.. అందువల్ల ఈ విమానాన్ని కూడా తమ సైనిక విమానం అనుకుని వాళ్లు పేల్చేశారని ఉక్రెయిన్ వర్గాలు అంటున్నాయి. కానీ తమమీద ఎలాంటి మచ్చ పడకుండా ఉండేందుకు రష్యా మరో కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. వాస్తవానికి బ్రిక్స్ సదస్సు ముగించుకుని వస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమానం కూడా సరిగ్గా అదే మార్గంలో వస్తోందని, దాన్ని పేల్చేయాలనుకుని.. గురి తప్పి మలేషియా విమానాన్ని ఉక్రెయిన్ వర్గాలే కూల్చేశాయని చెబుతోంది. వాస్తవానికి విమాన ప్రమాదం సంభవించిన తర్వాత చాలాసేపటి వరకు రష్యా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తమ దేశం మీద విధించిన ఆంక్షలను తొలగించాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మాట్లాడిన పుతిన్.. పనిలో పనిగా ఆయనకు విమాన ప్రమాదం గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో రష్యా పాత్ర ఏంటన్న ప్రశ్నలు వస్తాయనే ఆలోచనతోనో ఏమో గానీ.. ఈ సరికొత్త కుట్ర సిద్ధాంతం ఒకటి వెలుగులోకి వచ్చిందని కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. కానీ నిజానికి ఇంతవరకు ఏ దేశానికి సంబంధించిన క్షిపణి దాడి వల్ల విమానం కూలిపోయిందో మాత్రం నిర్ధారణ కాలేదు. ప్రమాదం సంభవించడానికి దాదాపు గంట ముందుగా వార్సా సమీపంలో ఎంహెచ్ 17 విమానాన్ని పుతిన్ ప్రయాణిస్తున్న విమానం దాటిందని అనధికార వర్గాలను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ తెలిపింది. దూరం నుంచి చూస్తే రెండు విమానాలు ఒకేలా ఉంటాయంటూ ఓ కల్పిత గ్రాఫిక్‌ను కూడా తయారుచేసింది. అయితే ఇదంతా తనకేమీ తెలియదన్నట్లు పుతిన్ మాత్రం చాలా భారంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ''ఈ భూమ్మీద శాంతి ఉండి ఉంటే ఈ విషాదం జరిగి ఉండేదే కాదు. లేదా.. కనీసం ఆగ్నేయ ఉక్రెయిన్ ప్రాంతంలో సైనిక దాడులు పునరుద్ధరించకపోయినా ఇలా జరిగేది కాదు'' అని ఆయన అన్నారు. -
ఎంహెచ్ 17: గుట్టు విప్పనున్న బ్లాక్‌బాక్సు
మలేషియన్ విమానం కుప్పకూలింది. మొత్తం అందులో ఉన్న 295 మందీ ప్రాణాలు కోల్పోయారు. అయితే విమాన ప్రమాదానికి కారణం ఏంటి.. అందరూ చెబుతున్నట్లు నిజంగానే క్షిపణిదాడి వల్లే కుప్పకూలిందా? ఈ విషయం కచ్చితంగా తెలియాలంటే బ్లాక్‌బాక్స్‌ను పరిశీలించాలి. ఎంతటి పెను ప్రమాదం సంభవించినా కూడా బ్లాక్‌బాక్స్ మాత్రం భద్రంగా ఉంటుంది. వాస్తవానికి నారింజరంగులో ఉండే ఈ బాక్సులో మొత్తం వివరాలన్నీ రికార్డు అవుతాయి. ఇక్కడ సంభవించిన ప్రమాదంలో ఎంహెచ్17 విమానంలోని బ్లాక్‌బాక్స్‌ను ఇప్పుడు ఎవరు తెస్తారన్నది అతిపెద్ద సమస్యగా మారింది. విమాన శిథిలాలను అంతర్జాతీయ పరిశీలకుల బృందం వెళ్లి చూడాలని ఐక్యరాజ్య సమితితో పాటు మలేషియా ప్రభుత్వం కూడా కోరుతోంది. అయితే, విమానం కూలిన ప్రదేశం మీద ఆధిపత్యం కోసం ఇప్పుడు కూడా ఉక్రెయిన్, రష్యా అనుకూల దళాలు తీవ్రంగా పోరాడుకుంటున్నాయి. మరోపక్క ఆ ప్రాంతంతో పాటు బ్లాక్‌బాక్స్ కూడా తమ ఆధీనంలోనే ఉన్నట్లు డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రకటించింది. వాటిని మాస్కోకు పంపాలని భావిస్తోంది. కాగా, మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ కూడా దీనిపై స్పందించారు. అంతర్జాతీయ దర్యాప్తు బృందం అక్కడకు వెళ్లేందుకు వీలుగా మానవీయ కోణంలోఆలోచించి మార్గం సుగమం చేయాలని ఆయన కోరారు. -
క్షణక్షణానికీ సమాచారం
తమ విమానం ప్రమాదానికి గురైన వెంటనే మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా బాహ్య ప్రపంచానికి అందించింది. ఆ వివరాలు ఇవీ.. * ఆమ్స్టర్డామ్ నుంచి బయల్దేరిన ఎంహెచ్17 విమానంతో మలేషియా ఎయిర్‌లైన్స్ కాంటాక్ట్ కోల్పోయింది. చిట్టచివరిగా ఆ విఆమనం ఉక్రెయిన్ గగనతలంలో కనిపించింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది * సంఘటన తెలియగానే మొత్తం యూరోపియన్ విమానాలన్నింటినీ ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాం * అత్యవసరంగా స్పందించే బృందాలతో కలిపి పనిచేయడమే ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం. వాళ్ల పూర్తి సహాయం తీసుకుని ఎంహెచ్17 విమానానికి కావల్సిన రక్షణ అంతా కల్పిస్తాం * ఎంహెచ్17 వెళ్తున్న మార్గం అత్యంత సురక్షితం, ఎలాంటి అడ్డంకులు లేనిదని ఐసీఏఓ, ఐఏటీఏ ప్రకటించాయి. అందుకే అది ఆ మార్గంలో వెళ్లింది * ఎంహెచ్ 17 విమాన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను వాళ్ల వారసులకు తెలియజేసే పనిలో ఉన్నాం. ఆ పని మొత్తం అయిన తర్వాత జాబితా విడుదల చేస్తాం * మాకు అండదండలు అందించిన అందరికీ కృతజ్ఞతలు. మా ఆలోచనలు, ప్రార్థనలు అన్నీ ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులతో ఉంటాయి Malaysia Airlines has lost contact of MH17 from Amsterdam. The last known position was over Ukrainian airspace. More details to follow. — Malaysia Airlines (@MAS) July 17, 2014 [#MASalert] With immediate effect, all European flights will be taking alternative routes avoiding the usual route http://t.co/HUIWQXl7dx — Malaysia Airlines (@MAS) July 17, 2014 Our focus now is to work with the emergency responders and mobilize its full support to provide all possible care to the #MH17 next-of-kin. — Malaysia Airlines (@MAS) July 18, 2014 Malaysia Airlines #MH17 flight route was declared safe and unrestricted by ICAO & IATA - http://t.co/HUIWQXl7dx — Malaysia Airlines (@MAS) July 18, 2014 We are in the process of notifying #MH17 next-of-kin. Once all have been notified, the passenger's manifest will be released. — Malaysia Airlines (@MAS) July 18, 2014 Thank you for all your support. Our thoughts and prayers are with #MH17 passengers and crew and their family members. — Malaysia Airlines (@MAS) July 18, 2014