క్షణక్షణానికీ సమాచారం | malaysian airlines tweets information every minute | Sakshi
Sakshi News home page

క్షణక్షణానికీ సమాచారం

Published Fri, Jul 18 2014 10:39 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

క్షణక్షణానికీ సమాచారం - Sakshi

క్షణక్షణానికీ సమాచారం

తమ విమానం ప్రమాదానికి గురైన వెంటనే మలేషియన్ ఎయిర్లైన్స్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా బాహ్య ప్రపంచానికి అందించింది. ఆ వివరాలు ఇవీ..
* ఆమ్స్టర్డామ్ నుంచి బయల్దేరిన ఎంహెచ్17 విమానంతో మలేషియా ఎయిర్లైన్స్ కాంటాక్ట్ కోల్పోయింది. చిట్టచివరిగా ఆ విఆమనం ఉక్రెయిన్ గగనతలంలో కనిపించింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది
* సంఘటన తెలియగానే మొత్తం యూరోపియన్ విమానాలన్నింటినీ ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాం
* అత్యవసరంగా స్పందించే బృందాలతో కలిపి పనిచేయడమే ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం. వాళ్ల పూర్తి సహాయం తీసుకుని ఎంహెచ్17 విమానానికి కావల్సిన రక్షణ అంతా కల్పిస్తాం
* ఎంహెచ్17 వెళ్తున్న మార్గం అత్యంత సురక్షితం, ఎలాంటి అడ్డంకులు లేనిదని ఐసీఏఓ, ఐఏటీఏ ప్రకటించాయి. అందుకే అది ఆ మార్గంలో వెళ్లింది
* ఎంహెచ్ 17 విమాన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను వాళ్ల వారసులకు తెలియజేసే పనిలో ఉన్నాం. ఆ పని మొత్తం అయిన తర్వాత జాబితా విడుదల చేస్తాం
* మాకు అండదండలు అందించిన అందరికీ కృతజ్ఞతలు. మా ఆలోచనలు, ప్రార్థనలు అన్నీ ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులతో ఉంటాయి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement