మలేసియాలో కొల్లగొట్టి అమెరికాలో విలాసాలు | 1MDB: The case that has riveted Malaysia | Sakshi
Sakshi News home page

మలేసియాలో కొల్లగొట్టి అమెరికాలో జల్సాలు

Published Fri, Jul 22 2016 4:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

మలేసియాలో కొల్లగొట్టి అమెరికాలో విలాసాలు

మలేసియాలో కొల్లగొట్టి అమెరికాలో విలాసాలు

కాలిఫోర్నియా: అమెరికా మన్‌హట్టన్‌లోని టైమ్ వార్నర్ సెంటర్‌లో ఉన్న 3.60 కోట్ల డాలర్ల ఖరీదైన పెంట్ హౌజ్, లాస్ ఏంజెలిస్ హిల్స్‌లోని 3.90 కోట్ల డాలర్ల మిలియన్ మాన్షన్, బెవర్లీ హిల్స్‌లోని 1.70 కోట్ల డాలర్ల ఖరీదైన బంగ్లాలను చూస్తే ఎవరికైనా కన్ను కుడుతోంది. ఈ భవనాల్లో నివసిస్తూ విలాసాల కులాసా జీవితాలను గడుపుతున్న మహరాజులు ఎంతటి వారో, వారు బంగారు స్పూన్లతో పుట్టి ఉంటారని అందరూ అనుకుంటారు. వారంతా ఖరీదైనా మనుషులే. సంపన్నలే. వారికి ఆ సంపదంతా అప్పనంగా వచ్చినదేనంట.

‘మలేసియా డెవలప్‌మెంట్ బెర్హాద్ (ఎండీబీ)’గా పిలిచే మలేసియా సార్వభౌమాధికార సంపద నిధి నుంచి అక్రమంగా కొల్లగొట్టిన వందకోట్ల డాలర్ల రూపాయలతోనే కొంతమంది చోరాగ్రేసరులు అమెరికాలో ఈ సంపదను కొనుగోలు చేశారట. వారంతా కూడా మలేసియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ సన్నిహితులేనట. వారిలో ఆయన సవతి తల్లి కుమారుడు కూడా ఉన్నారట. ఈ విషయాలన్నీ అమెరికా న్యాయ శాఖ విచారణలో వెల్లడయ్యాయి. ప్రధాన మంత్రి నజీబ్ పలుకుబడిని ఉపయోగించుకున్న ఆయన సన్నిహితులు దొంగ చమురు ఒప్పందాల పేరిట కోట్లాది రూపాయలను దండుకొని వాటిని షెల్ కంపెనీల పేరిట వివిధ దేశాల మీదుగా అమెరికాకు సంపదనను తరలించారని అమెరికా న్యాయశాఖ అభిప్రాయపడింది.


మలేసియాలో కొత్త చమురు నిక్షేపాలను అభివృద్ధి చేయడంతోపాటు పలు ప్రజా ప్రాజెక్టులను అమలు చేయడం కోసం 2009లో ఎండీబీ నిధిని మలేసియా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులోని ప్రతి పైసా మలేసియా పౌరులకు చెందినదే. వారి సంక్షేమం కోసమే అందులోని ప్రతి పైసాను ఖర్చు చేయాల్సి ఉంది. అయితే కొంతమంది రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయి బ్యూరోక్రాట్లు, సంపన్నులు కుమ్మక్కై దొంగ ఒప్పందాల పేరిట ఇలా డబ్బును దండుకుంటున్నారు. వాటిని షెల్ కంపెనీల పేరిట దేశ దేశాలను దాటిస్తున్నారు. ఇందుకోసం వారు ఖరీదైన సెలబ్రిటీ పార్టీలను, ఖరీదైన షిప్పుల్లో విహార యాత్రలను నిర్వహిస్తున్నారు.

అలా సంపాదించిన సొమ్ముతో కొంత మంది భారీ ఎత్తున జూదం ఆడుతుండగా, మరికొందరు హాలివుడ్ సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ‘ది ఫూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’ అనే హాలివుడ్ సినిమాను మలేసియా ప్రజల డబ్బుతోని తీసినట్లు అమెరికా న్యాయ శాఖ దర్యాప్తులో వెల్లడైంది. మలేసియా సార్వభౌమా సంపద నిధి నుంచి మొత్తం మూడు వందల కోట్ల డాలర్లు అక్రమంగా ఆ దేశం నుంచి తరలిపోగా అందులో వంద కోట్ల డాలర్లు మాత్రమే అమెరికాకు చేరాయట. షెల్ కంపెనీల పేరిట సంపన్నులు, వివిధ వర్గాలకు చెందిన పెద్దలు పెడుతున్న అక్రమ పెట్టుబడుల గురించి పనామా పత్రాలు బయట పడిన నేపథ్యంలో ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక జరిపిన ఓ పరిశోధనలో అమెరికా అక్రమ పెట్టుబడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ పత్రిక ఈ కేసులో తీగలాగగా, అమెరికా న్యాయశాఖ డొంక కదిపింది.

దాంతో మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ సవతి తల్లి కొడుకు రిజా అజీజ్. ఆయన హాలివుడ్ సినీ నిర్మాత. ఆయనకు ఒకప్పుడు ఎంతో సన్నిహిత మిత్రుడిగా ఉన్న జో లో, అబూదాబిలోని ప్రభుత్వ నిధి మాజీ అధికారి మొహమ్మద్ బద్వి అల్ హుస్నేని తదితరుల పేర్లు ఈ వ్యవహారంలో బయటకు వచ్చాయి. వీరు మలేసియా నిధిని కొల్లగొట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న వారిలో ముఖ్యులని కూడా అమెరికా న్యాయశాఖ పేర్కొంది. అయితే వీరెవరిపైనా ఇంతవరకు క్రిమినల్ కేసులు దాఖలు చేయలేదు. వారు అమెరికాలో కొనుగోలు చేసిన ఆస్తులకు ఏయే షెల్ కంపెనీల నుంచి నిధులను అక్రమంగా తరలించారలో ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఆ శాఖ అభిప్రాయపడింది. మలేసియాలో జరిగిన నిధి కుంభకోణం ఆ దేశం అంతర్గత సమస్యని, అది అమెరికా పరిధిలోకి రాదని న్యాయశాఖ ప్రాసిక్యూటర్లు మీడియాకు తెలిపారు.

మలేసియా ఎండీబీ నిధుల దుర్వినియోగంపై ఆ దేశంలో ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తుండడంతో ఆ దేశం దర్యాప్తునకు కూడా ఆదేశించింది. అయితే ఆ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని, దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న ఉన్నతాధికారులను దేశ ప్రధాని నజీబ్ ఎప్పటికప్పుడు బదిలీ చేస్తున్నారని అక్కడి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. న్యాయబద్ధంగా జరిగే ఎలాంటి విచారణకైనా తమ సహాయ సహకారాలు ఉంటాయని అమెరికా న్యాయశాఖ వెల్లడించిన తాజా అంశాలపై అక్కడి ప్రధాని కార్యాలయం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. షెల్ కంపెనీల పేరిట నల్ల డబ్బు దేశం నుంచి తరలించడం భారత్ సహా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. ఇప్పుడు ఈ సమస్య అమెరికాకు కూడా చుట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement