సింగపూర్ తెలుగు సమాజం అనాదిగా నిర్వహించే సంక్రాంతి సందడి ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించింది. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం, ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా మన ఊరి పండుగ వాతావరణం ప్రతిబింబించేలా నిర్వహించారు. కోవిడ్ నిబంధనల కారణంగా భోగి పండుగకు రేగుపండ్ల ప్యాకెట్స్ ని ఉచితంగా పంపిణీ చేయలేకపోయారు. వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమాన్ని సుమారు 5000 మంది వరకు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
సింగపూర్ లో నివసిస్తున్న బాలబాలికలు, యువతీ యువకులచే వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిచడమే కాకుండా, మహిళలచే రంగవల్లులు, చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి, కార్యక్రమ వీక్షకుల అభిప్రాయసేకరణతో విజేతలకు బహుమతులు అందజేశారు.
సింగపూర్ క్యాలెండర్
ఈ సంబరాలలో సింగపూర్ కాలమానంలో గుణించిన సింగపూర్ తెలుగు 2022 క్యాలెండెర్ ను ఆవిష్కరించారు. ఆంగ్లం ఉపయోగించకుండా తెలుగులో మాత్రమే మాట్లాడే కార్యక్రమం తెలుగు పలుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం అన్ని వయస్సుల వారిని ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతికి పట్టుగొమ్మలు , అచ్చతెలుగు సంక్రాంతికి ఆలవాలమైన తెలుగు రాష్ట్రాల పల్లెల్లో పండుగను వీడియో ద్వారా చూపించి అందరి మన్ననలను పొందారు. ఆటపాటల విజేతలకు తెలుగు సమాజం తరఫున బహుమతులు అందజేశారు.
విజేతల ప్రకటన
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.., తెలుగు వారందరికీ సంక్రాతి శుభాకాంక్షలతో తెలిపారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన లక్ష్మీ నారాయణ, అనిత రెడ్డి, మైత్రి, సౌందర్య, రాఘవలతో పాటు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన స్వాతిలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతి పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను ప్రకటించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లను పోస్ట్ ద్వారా పంపిస్తామన్నారను. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ్యాన్సీ డ్రెస్: కృతిక (ప్రథమ బహుమతి), డి.తస్విఖ (రెండవ బహుమతి), సంహిత (తృతీయ బహుమతి) , గర్వ్ కుండ్లియా (కన్సొలేషన్ బహుమతి), వరాహగిరి వేదాంషి (కన్సొలేషన్ బహుమతి)
రంగోలి: పావని చిలువేరు (ప్రథమ బహుమతి), నీలా దేవి (రెండవ బహుమతి) మరియు పోలినేని లీలా భార్గవి (తృతీయ బహుమతి)
తెలుగు పలుకులు: కొమ్మిరెడ్డి నిషాంత్ రెడ్డి (ప్రథమ బహుమతి) , లక్ష్మి శ్రీనిజ చింతలపూడి (ద్వితీయ బహుమతి), రావూరి జ్ఞాన కౌశికి (తృతీయ బహుమతి) మరియు నామ సాయి ఈశ్వర (కన్సొలేషన్ బహుమతి)
కృతజ్ఞతలు
ఆహ్లాదభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, స్వచ్ఛంద సేవకులకు , కార్యవర్గానికి , కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలను తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment