"వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ ఇండియన్" & "శుభోదయం" గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై ప్రతిష్టాత్మక "స్వర్ణ వంశీ శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారాలు 2022" కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. "ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల నుంచి 37 మంది మహిళా మణులు ఈ అవార్డుకు ఎంపికయ్యారని, 50 సంవత్సరాల వంశీ సంస్థ ఈ సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుపుకోబోతున్న సందర్భంగా, అంతర్జాతీయంగా సాహిత్య, సంగీత, సాంస్కృతిక, సేవా రంగాలలో రాణిస్తున్న వివిధ దేశాలలో ఉన్న తెలుగు మహిళల కృషి & సేవలకు గుర్తిస్తూ ఈ పురస్కారాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని" వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, యమ్.ఎల్.సి సురభి వాణీదేవి, ప్రముఖ సినీకవి భువనచంద్ర, శుభోదయం చైర్మన్ డా కలపటపు లక్ష్మీప్రసాద్, సింగపూర్ నుంచి కవుటూరు రత్నకుమార్ తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతలకు తమ అభినందనలు తెలియజేశారు. రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక నిర్వహణలో ప్రత్యేకమైన విజువల్ ఎఫెక్ట్స్'తో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది. భువనచంద్ర ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని, పురస్కార విజేతల పేర్లను జతపరచి చక్కటి పాటను రాసి బాణి కూర్చి పాడి వినిపించడంతో అందరూ చాలా ఆనందించారు.
రాధిక మంగిపూడి, కాత్యాయని గణేశ్న, సింగపూర్ నుండి, శ్రీలత మగతల, డా పద్మ మల్లెల, న్యూజిలాండ్ నుండి, విజయ గొల్లపూడి, రమ కంచిభొట్ల ఆస్ట్రేలియా నుండి, బొంతల శ్రీలక్ష్మీ రమేష్ బాబు యుగాండా నుండి జయ పీసపాటి హాంకాంగ్ నుండి సత్యాదేవి మల్లుల మలేషియా నుండి, దీపిక రావి సౌదీ అరేబియా నుండి, ఫణి కళ్యాణి కొండూరు, రాజారమాపద్మజ ఉసిరికల, వర్ధని దేవి పాలగిరి, శ్రీవాణి అరికరేవుల ఖతార్ నుండి, శ్రీదేవి దాచేపల్లి, ఒమాన్ నుండి, డా. భారతి చాపరాల, కందుకూరి భారతి, వింజమూరి రాగసుధ యూ.కె నుండి, వడ్డాది రవళి, ఫిన్లాండ్ నుండి, రమ్య కృష్ణ, నెథర్లాండ్స్ నుండి, సాయి స్వాతి గురయ్య, మారిషస్ నుండి, శ్రావణి రెడ్డి పెట్లూరు దక్షిణాఫ్రికా నుండి, సుధ కామేశ్వరి వేమూరి కెనడా నుండి, అమెరికా నుండి లలితా రామ్, డా. శారదా పూర్ణ శొంఠి, శారద కాశీవజ్ఝల, మణి శాస్త్రి, రాధిక నోరి, డా. నాగేశ్వరి కృష్ణారెడ్డి, తేలుకుంట్ల జయశ్రీ, శ్రీదేవి జాగర్లమూడి, గుణసుందరి కొమ్మారెడ్డి, రాధ కాశీనాథుని, శారదా సింగిరెడ్డి, సుజాత వెంపరాల, మంజు భార్గవ, రమా కుమారి వనమా ఈ పురస్కారాలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment