
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల తొలి శిఖరాగ్ర సమావేశానికి వేదిక, తేదీ ఖరారయ్యాయి. జూన్ 12న సింగపూర్‌లో ఇరువురు నేతలు భేటీ అయి కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణపై చర్చలు జరపనున్నారు. స్వయంగా ట్రంపే గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఉత్తర కొరియా నిర్బంధం నుంచి ముగ్గురు అమెరికా పౌరులను విడిపించుకుని విదేశాంగ మంత్రి మైక్ పోంపియో స్వదేశం చేరుకున్న వెంటనే ట్రంప్ ఈ ప్రకటన చేశారు.