మైక్ పాంపియో
ప్యాంగ్‌యాంగ్: అణు నిరాయుధీకరణ కోసం అమెరికా బందిపోటు మాదిరి షరతులు పెడుతోందని ఉత్తరకొరియా మండిపడింది. చర్చల సందర్భంగా ఆ దేశం వ్యవహరించిన తీరు చాలా దురదృష్టకరమని పేర్కొంది. అయితే, తమ మధ్య చర్చలు ఫలవంతంగా సాగాయని అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ ఇటీవల సింగపూర్‌లో జరిపిన శిఖరాగ్ర భేటీ అనంతరం పాంపియో గత రెండు రోజుల్లో 8 గంటలపాటు ఉత్తరకొరియా కీలక నేత యోంగ్ చోల్‌తో చర్చించారు. ‘సింగపూర్ సమావేశం స్ఫూర్తిని దెబ్బతీసేలా మైక్ పాంపియో వ్యవహరిస్తున్నారు. అణ్వాయుధాలను వదిలివేసేందుకు ఏకపక్షంగా, బందిపోటు మాదిరి బెదిరిస్తూ అనేక డిమాండ్లను మా ముందుంచారు’ అని చర్చల అనంతరం ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment