సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ల కలయిక మంగళవారం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భేటీ విజయవంతం కావడం ఆ తర్వాత అధికారిక లంచ్‌కు ఇరువురు నేతలు హాజరయ్యారు. అనంతరం ఇద్దరూ కలసి నవ్వుతూ మాట్లాడుతూ కనిపించారు. ఇంతలో ట్రంప్ తన కారు ‘ది బీస్ట్’ను కిమ్ జాంగ్‌కు పరిచయం చేశారు.
కారు వద్దకు కిమ్‌ను తీసుకెళ్లిన ట్రంప్ పక్కనే ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు సైగ చేశారు. దాంతో అతను డోర్ తెరిచాడు. కారులోని సదుపాయాల గురించి ట్రంప్ కిమ్‌కు వివరించారు. అంతకుముందు ఇద్దరు దేశాధ్యక్షులు సెంటోసా ద్వీపంలోని కెపెల్లా హోటల్‌లో కలియ తిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment