Transport Minister S Iswaran assisting in CPIB investigations - Sakshi
Sakshi News home page

అవినీతి కేసు పీకల్లోతులో చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ఈశ్వరన్

Published Wed, Jul 12 2023 10:57 AM | Last Updated on Thu, Jul 13 2023 11:22 AM

iswaran cpib assist investigations ongoing - Sakshi

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబును నమ్ముకున్న ఏ ఒక్కరూ సక్రమమైన దారిలో నడిచినట్టు చరిత్రలో లేదు. అమరావతిని బాహుబలి సినిమాలో మాదిరిగా రూపొందిస్తానంటూ సింగపూర్ బృందాన్ని విజయవాడలో దింపి.. ఠక్కుఠమార విద్యలన్నీ ప్రదర్శించిన బాబు డొల్లతనం ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో బయటపడుతోంది. చంద్రబాబుతో కలిసి అమరావతిని ఏదో చేస్తామని చెప్పిన సింగపూర్ బృంద నాయకుడు ఈశ్వరన్ ఇప్పుడు కీలక నేరాల్లో చిక్కుకుని పదవికి దూరమయ్యారు. ఇక్కడి సిబిఐని మేనేజ్ చేసుకుని కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు.. ఇప్పుడు సింగపూర్ లో CBIకి సమానమై CPIB ని ఈశ్వరన్ కోసం ఏ రకంగా ప్రభావితం చేస్తాడో చూడాలి.



బాబు పార్ట్ నర్ ఈశ్వరన్ అసలు రూపం ఇది
ఈశ్వరన్ సింగపూర్ దేశంలో రవాణాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీగా నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు తీవ్రత ఏంటీ? ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాలేంటీ? దేశానికి ఏ రకంగా నష్టం జరిగింది? అన్న వివరాలను అక్కడి దర్యాప్తు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఒక హైప్రొఫైల్ కేసు అని, అత్యంత కీలక అంశాలతో ముడిపడి ఉన్న విషయమని సింగపూర్ వర్గాల సమాచారం.

అందుకే ఈశ్వరన్ ను విచారించేందుకు అక్కడి దర్యాప్తు సంస్థ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CPIB) ప్రధానిని అనుమతి అడగ్గానే ఆయన స్పందించారు. ఈశ్వరన్ ను అధికారికంగా విచారిస్తామంటూ డైరెక్టర్‌ డెనిస్‌ టాంగ్‌ ప్రధాని లీ అనుమతిని కోరారు.

ఈ నేపధ్యంలో తాను జూలై 6న సీపీఐబీ డైరెక్టర్‌కి సమ్మతి తెలిపానని, ఆ తర్వాత అధికారిక విచారణ జూలై 11న ప్రారంభమైందని ప్రధాన మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఈశ్వరన్‌ను ఆదేశించినట్లు ప్రధాని లీ తెలిపారు.

ఎవరీ ఈశ్వరన్ 
అమరావతి విషయంలో ఎన్నో కొత్త విషయాలను తెరమీదికి తెచ్చారు చంద్రబాబు. అందులో ముఖ్యమైంది రైతుల భూమిని సేకరించి అభివృద్ధి చేసి మళ్లీ ఇస్తానని. ఇందులో భాగంగా సింగపూర్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం  చేసుకున్నట్టు ప్రకటించారు.

మే 17, 2017న సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సమక్షంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిపై నాటి చంద్రబాబు ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి స్టార్టప్‌ ఏరియాకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం  జరిపి MOUలో భాగంగా సింగపూర్‌ కంపెనీలకు 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. అమరావతి భూములను అభివృద్ధి చేసినందుకు సింగపూర్ ప్రభుత్వానికి 58% వాటా, ఏపీ ప్రభుత్వానికి 42% వాటా ఉంటుందని బాబు చెప్పారు.

ఈ సింగపూర్ కన్సార్టియానికి మంత్రి ఈశ్వరన్ నేతృత్వం వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇంకేముంది విడతల వారీగా సింగపూర్ బృందాలు విజయవాడ రావడం, ప్రతీ నెలా సమావేశాలు పెట్టడం.. అదిగో ఇదిగో అంటూ రకరకాల ఊహాచిత్రాలను విడుదల చేయడం జరిగింది. అయిదేళ్లలో చంద్రబాబు గానీ, ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియం గానీ చేసిందేమీ లేదు. 

2019లో ఏం తేలింది?
2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. అదే సమయంలో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి ఒప్పందం గురించి పరిశీలించగా.. అసలు ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియానికి సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. సింగపూర్ లోని కొన్ని సంస్థలు కలిసిందే కన్సార్టియం తప్ప చంద్రబాబు అప్పటివరకు చెప్పినట్టు సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని తేలింది. 

(చదవండి : కన్సార్టియం పేరిట బాబు అక్రమాలు ఇవి)

‘పక్షపాతం లేకుండా దర్యాప్తు’
ఒక మంత్రిగా ఉన్న ఈశ్వరన్ మీద ఆరోపణలు రావడంతో అక్కడి దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాలను వెలికితీయడానికి, సత్యాన్ని నిరూపించడానికి, చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి, దృఢ సంకల్పంతో ఈ కేసును దర్యాప్తు చేస్తామని పేర్కొంది. CBIP చేపట్టే అన్ని కేసులను పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తుందని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడే పార్టీలపై చర్య తీసుకోవడానికి వెనుకాడదని ఆ ప్రకటనలో పేర్కొంది.

మరో వైపు ఈశ్వరన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను కూడా సీపీఐబీ విచారిస్తుందని ప్రధాన మంత్రి లీ సియన్ లూంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూరో బయటపెట్టిన ఒక కేసుకు సంబంధించి ఇటీవల సీబీఐబీ డైరెక్టర్ తనకు సమాచారం అందించారని ప్రధాని లీ చెప్పారు.

ఈశ్వరన్ రాజకీయ జీవితం..
మంత్రి ఈశ్వరన్ రాజకీయ జీవితం 1997లో వెస్ట్ కోస్ట్ GRCకి పార్లమెంటు సభ్యునిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుండి ప్రారంభమయ్యింది. 26 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2006లో క్యాబినెట్‌లోకి ప్రవేశించకముందు అనేక ప్రభుత్వ పార్లమెంటరీ కమిటీలలో సభ్యనిగా కొనసాగారు. సెప్టెంబర్ 2004 నుండి జూన్ 2006 వరకు పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 

మే 2021 నుండి రవాణా మంత్రిగా ఉన్నారు. మే 2018 నుండి వాణిజ్య సంబంధాల ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మంత్రి ఈశ్వరన్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలలో మంత్రి పదవులను కూడా నిర్వహించారు. మే 2011 నుండి సెప్టెంబర్ 2015 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో మంత్రిగా కూడా ఉన్నారు.

రాజకీయాలలో ప్రవేశించక ముందు ఈశ్వరన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు టెమాసెక్ హోల్డింగ్స్‌తో సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేశారు. ఈశ్వరన్ ను పక్కకు తప్పించడంతో ఆయన బాధ్యతలను సింగపూర్‌ సీనియర్ మంత్రి చీ హాంగ్ టాట్ పర్యవేక్షిస్తారని ప్రధాని తెలిపారు. 


ఇది కూడా చదవండి: ‘శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తమోడుతున్న చీరతో’..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement