![462 companies being investigated by Ministry of Corporate Affairs over the past five years](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/enquiry01.jpg.webp?itok=iG4ynH63)
అనుమానాస్పద మోసపూరిత లావాదేవీల విషయమై కార్పొరేట్ శాఖ రీజినల్ డైరెక్టర్లు 462 కంపెనీలపై దర్యాప్తు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి హర్ష్ మల్హోత్రా తెలిపారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో కార్పొరేట్ మోసాలు పెరిగాయనడానికి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. కార్పొరేట్ శాఖ రీజినల్ డైరెక్టర్లు (ఆర్‌డీలు), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) అధికారులు సాధారణంగా మోసపూరిత లావాదేవీలపై దర్యాప్తు నిర్వహిస్తుంటారు. ఆర్‌డీలు, ఎస్‌ఎఫ్‌ఐవో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్న కేసుల వివరాలను కార్పొరేట్ శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభకు లిఖిత పూర్వకంగా అందించారు. 2019–2020 మధ్య ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కార్పొరేట్ శాఖ ఆర్‌డీలు 462 కంపెనీలపై దర్యాప్తు నిర్వహించగా, ఎస్‌ఎఫ్‌ఐవో 72 కేసుల దర్యాప్తును చేపట్టినట్టు తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ శాఖ ఆర్‌డీలు 51 కంపెనీలపై దర్యాప్తు నిర్వహించినట్టు చెప్పారు.
ఇదీ చదవండి: నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలు
బీఎస్‌ఈ నుంచి కొత్త ఇండెక్సులు
స్టాక్ ఎక్స్ఛేంజీ బీఎస్‌ఈ అనుబంధ సంస్థ ఏషియా ఇండెక్స్ తాజాగా ఐదు సూచీలను ప్రవేశపెట్టింది. మార్కెట్ నుంచి బీఎస్‌ఈ 1000సహా మరో 4 ఇండెక్సులను రూపొందించింది. దీని ద్వారా మార్కెట్‌లో పెట్టుబడులకు మరిన్ని అవకాశాలకు తెరతీసింది. దీంతో దేశీయంగా తదుపరితరం వర్ధమాన కంపెనీల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్కెట్ పార్టిసిపెంట్లకు వీలు కల్పించనుంది. బీఎస్‌ఈ 1000తోపాటు బీఎస్‌ఈ నెక్ట్స్ 500, బీఎస్‌ఈ 250 మైక్రోక్యాప్, బీఎస్‌ఈ నెక్ట్స్ 250 మైక్రోక్యాప్, బీఎస్‌ఈ 1000 మల్టీక్యాప్‌తో కొత్త ఇండెక్సులకు తెరతీసింది. మొత్తం దేశీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో 93 శాతాన్ని బీఎస్‌ఈ 1000 ఇండెక్స్ ప్రతిఫలించనున్నట్లు ఏషియా ఇండెక్స్ ఎండీ, సీఈవో అశుతోష్ సింగ్ పేర్కొన్నారు. వెరసి మొత్తం స్టాక్ మార్కెట్‌కు ప్రామాణిక ఇండెక్స్‌గా ఇది నిలవనున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment