
నెల్లూరు(క్రైమ్): ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా మద్యం విక్రయాలు సాగిస్తున్న నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఎక్సైజ్, స్థానిక పోలీసులు దాడిచేశారు. వారి కథనం మేరకు.. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జిల్లాలో మద్యం విక్రయాలు నిలుపుదల చేశారు. ఆదివారం అర్ధరాత్రి నగరంలోని మెక్లిన్స్‌రోడ్డులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లోని సిబ్బంది బార్ సీల్‌ను తొలగించి గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ విషయంపై చిన్నబజారు, ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నెల్లూరు –1 ఇన్‌స్పెక్టర్ ఎ.రత్నం, చిన్నబజారు పోలీస్‌స్టేషన్ ఎస్సై అలీసాహెబ్‌లు, సిబ్బంది బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేశారు. మద్యం విక్రయిస్తున్న షేక్ మహ్మద్, షేక్ సలీంలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మద్యం విక్రయాల తాలూకా నగదు రూ.1,41,100, 59 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment