
జూమ్ యాప్ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్
నెల్లూరు(అర్బన్): వివిధ క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులతో కలెక్టర్ చక్రధర్‌బాబు మంగళవారం రాత్రి మాట్లాడారు. నగరంలోని జెడ్పీ ఆవరణలో గల డీఈఓసీ కేంద్రం నుంచి జూమ్ యాప్ ద్వారా కలెక్టర్ రోగులతో మాట్లాడారు. ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. వైద్య చికిత్స ఎలా అందుతోంది.. వైద్యులు అందుబాటులో ఉన్నారానని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తారని.. ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రోజూ జూమ్ యాప్ ద్వారా రోగులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అనంతరం డీఈఓసీ కేంద్రంలో పనిచేసే సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment