
సాక్షి, నెల్లూరు: బుధవారం అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూసిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతిక కాయం నెల్లూరు జిల్లా వెంకటగిరికి చేరుకుంది. ఆయనకు పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. దుర్గాప్రసాద్ భౌతికకాయానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తనకు బల్లి దుర్గా ప్రసాద్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కాసేపట్లో... వెంకటగిరి పట్టణం కర్ణకమ్మవీధి నుంచి బల్లి దుర్గా ప్రసాద్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. కాంపాలెం ప్రాంతంలోని తోటలో బల్లి దుర్గాప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నాయి.
పలువురు నివాళులు..
అనారోగ్యంతో మరణించిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ భౌతికకాయానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి, ఢిల్లీ బాబు, వెంకటేశ్వర రావు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment