సాక్షి, బెంగళూరు: ప్రముఖ భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు బృహత్ పాలికె నోటీసులు జారీ చేసింది. నగరంలో చిన్నస్వామి స్టేడియం ఎదుట ఒన్8 కమ్యూన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది.
దీనికి అగి్నమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని సామాజిక కార్యకర్త హెచ్‌ఎం వెంకటేశ్ పాలికెకి ఫిర్యాదు చేశారు. దీంతో సమాధానం ఇవ్వాలని ఆ బార్‌కి నోటీసులు జారీ అయ్యాయి. సమాధానం రాకపోవడంతో మరోసారి తాఖీదులు పంపారు. కాగా, సమయం మించినా పని చేస్తోందని ఇదే బార్ మీద గత జూలైలో కబ్బన్ పార్కు పోలీసులు కేసు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment