cricketer virat kohli
-
కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు బృహత్ పాలికె నోటీసులు జారీ చేసింది. నగరంలో చిన్నస్వామి స్టేడియం ఎదుట ఒన్8 కమ్యూన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దీనికి అగి్నమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేశ్ పాలికెకి ఫిర్యాదు చేశారు. దీంతో సమాధానం ఇవ్వాలని ఆ బార్కి నోటీసులు జారీ అయ్యాయి. సమాధానం రాకపోవడంతో మరోసారి తాఖీదులు పంపారు. కాగా, సమయం మించినా పని చేస్తోందని ఇదే బార్ మీద గత జూలైలో కబ్బన్ పార్కు పోలీసులు కేసు పెట్టారు. -
అనుష్కకు స్వీట్ షాక్!
లవ్‌లో ఉన్నప్పుడు ప్రేమికులు ఒకరికి ఒకరు స్వీట్ షాక్‌లు ఇచ్చుకుంటుంటారు. ఇటీవల క్రికెటర్ విరాట్ కోహ్లి తన గాళ్ ఫ్రెండ్ అనుష్కా శర్మకు అలాంటి షాకే ఇచ్చారని సమాచారం. ఈ స్వీట్ షాక్‌కి వేదికగా నిలిచింది లండన్. అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’ షూటింగ్ అక్కడ జరుగుతోంది. ఆమె కోసం విరాట్ లండన్ వెళ్లాలనుకున్నారట. ఆ విషయాన్ని ముందుగానే అనుష్కతో చెప్పారట. కానీ, చెప్పినదానికన్నా ఒకరోజు ముందే లండన్‌లో తన ముందు ప్రత్యక్షమైన విరాట్‌ను చూసి, ఆనందంతో అనుష్క ఉబ్బితబ్బిబ్బయ్యారట. -
మాక్కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి!
‘‘వ్యక్తిగత విషయాలను ఎంత రహస్యంగా ఉంచుకుందామనుకున్నా, ఎలాగైనా తెలుసు కోవాలనే పని మీద కొంతమంది ఉంటారు. ఈ క్రమంలో లేనిపోనివి ఊహించేసుకుని, ఏవేవో ప్రచారం చేసేస్తుంటారు. పోనీ.. అసత్య ప్రచారాలు చేస్తున్నారు కదా అని ఉన్న విషయం చెప్పేసినా వాళ్లు కుదురుగా ఉండరు’’ అని అనుష్క శర్మ అంటున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీతో తన అనుబంధం గురించే ఆమె ఈ విధంగా అంటున్నారు. ‘అవును.. మా మధ్య ఎఫైర్ సాగుతోంది’ అని ఓ సందర్భంలో ఈ ఇద్దరూ ఒప్పుకున్నారు కూడా. అలా చెప్పాక కూడా ఇంకా వార్తలు ఎక్కువయ్యాయి. ఆ ప్రచారాలను కట్టిపెట్టాలనీ, కొంచెం స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందనీ అనుష్క శర్మ చెబుతూ - ‘‘ఏ విషయాన్నీ మేం (విరాట్) రహస్యంగా ఉంచదల్చు కోలేదు. అందుకే, మా మధ్య అనుబంధం ఉందని చెప్పేశాం. ఆ విధంగా మీడియాను మేం గౌరవించాం. ఇక, ఇప్పుడు మమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత మీడియాదే. ఏ విషయానికైనా ఓ గీత ఉంటుంది. దాన్ని దాటకూడదు’’ అని అన్నారు.