మాక్కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి! | Anushka Sharma is open to television shows | Sakshi
Sakshi News home page

మాక్కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి!

Published Sun, Feb 22 2015 11:02 PM | Last Updated on Fri, Aug 17 2018 5:11 PM

మాక్కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి! - Sakshi

మాక్కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి!

‘‘వ్యక్తిగత విషయాలను ఎంత రహస్యంగా ఉంచుకుందామనుకున్నా, ఎలాగైనా తెలుసు కోవాలనే పని మీద కొంతమంది ఉంటారు. ఈ క్రమంలో లేనిపోనివి ఊహించేసుకుని, ఏవేవో ప్రచారం చేసేస్తుంటారు. పోనీ.. అసత్య ప్రచారాలు చేస్తున్నారు కదా అని ఉన్న విషయం చెప్పేసినా వాళ్లు కుదురుగా ఉండరు’’ అని అనుష్క శర్మ అంటున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీతో తన అనుబంధం గురించే ఆమె ఈ విధంగా అంటున్నారు. ‘అవును.. మా మధ్య ఎఫైర్ సాగుతోంది’ అని ఓ సందర్భంలో ఈ ఇద్దరూ ఒప్పుకున్నారు కూడా.

అలా చెప్పాక కూడా ఇంకా వార్తలు ఎక్కువయ్యాయి. ఆ ప్రచారాలను కట్టిపెట్టాలనీ, కొంచెం స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందనీ అనుష్క శర్మ చెబుతూ - ‘‘ఏ విషయాన్నీ మేం (విరాట్) రహస్యంగా ఉంచదల్చు కోలేదు. అందుకే, మా మధ్య అనుబంధం ఉందని చెప్పేశాం. ఆ విధంగా మీడియాను మేం గౌరవించాం. ఇక, ఇప్పుడు మమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత మీడియాదే. ఏ విషయానికైనా ఓ గీత ఉంటుంది. దాన్ని దాటకూడదు’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement