
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈమధ్య ఎక్కడికి వెళ్లినా, ‘భుజానికి ఏమైంది? భుజానికి ఏమైంది?’ అన్న ప్రశ్నలు ఎక్కువ వినిపిస్తున్నాయి. షూటింగ్ స్పాట్‌లోనూ అంతే! ఏదైనా ఫంక్షన్‌కి అటెండ్ అయినా అంతే!! ఆయన ఎడమ భుజానికి మొత్తం ఒక పట్టీ వేసి ఉండడం వల్ల అందరూ ఇలా అడుగుతున్నారు. సరే.. అందరూ అడుగుతున్నారు కదాని బిగ్ బి స్వయంగా తన బ్లాగ్‌లో దీనిగురించి చెప్పుకొచ్చారు. గతంలో షూటింగ్ స్పాట్‌లో జరిగిన గాయం ఇప్పటికీ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుందని, ఇప్పుడిది కూడా దానివల్లే అని చెప్పారు.
మొదట్లో ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు అనిపించినా, ఈ మధ్యే సెట్స్‌లో ఓ కీలక సన్నివేశం తీస్తున్న సమయంలో మరోసారి భుజం దగ్గరి ఎముకల్లో చిన్న బ్రేక్ వచ్చిందట. ఇందుకోసం ఐస్, పట్టీ వేసి అమితాబ్‌కు చికిత్సను అందిస్తున్నారు. ‘ఇదేమంత ఇబ్బంది పెడుతున్న విషయం కాదు’ అంటూ షూటింగ్స్‌తో ఆయన బిజీగా గడిపేస్తున్నారు. విరాట్ కోహ్లి – అనుష్క శర్మల రిసెప్షన్‌కు కూడా అమితాబ్ భుజానికి ఈ పట్టీ వేసుకొనే వచ్చారు. బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమా అనేదానికి ఒక ఐకాన్ అనిపించుకున్న సూపర్‌స్టార్ అమితాబ్.. 75 ఏళ్ల వయసులో గాయాలను సైతం లెక్కచేయకుండా షూటింగ్స్‌తో బిజీగా గడుపుతూ ఉన్నారంటే ఆయన సూపర్‌స్టార్ ఊరికే అవ్వలేదు!!
కుమార్తె శ్వేతానందాతో అమితాబ్.
Comments
Please login to add a commentAdd a comment