ట్విట్టర్‌లో...అమితాబ్ వార్నింగ్! | Amitabh Bachchan Warns Anushka Sharma On Twitter | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌లో...అమితాబ్ వార్నింగ్!

Published Mon, Jul 27 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

ట్విట్టర్‌లో...అమితాబ్ వార్నింగ్!

ట్విట్టర్‌లో...అమితాబ్ వార్నింగ్!

 నువ్వంటే నాకిష్టం.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా...

 ఇంతకీ విరాట్ కోహ్లీతో నీ లవ్‌స్టోరీ ఎందాకా వచ్చింది?...

 రణ్‌వీర్ సింగ్‌ని వదిలేసినట్లే... విరాట్‌కి కూడా టాటా చెప్పేస్తావా?... ఆ తర్వాత నాకు ‘ఐ లవ్ యు’ చెబుతావా?...
 
 ఇలాంటి ప్రశ్నలన్నీ అనుష్కా శర్మను అడిగితే ఓ రేంజ్‌లో ఒళ్లు మండకుండా ఉంటుందా? ట్విట్టర్లో ఆమెను ఫాలో అవుతున్నవాళ్లల్లో కొంతమంది ఇలా వెకిలి ప్రశ్నలేసి అనుష్కా శర్మను విసిగిస్తున్నారట. దాంతో ఎవరైతే తన ట్విట్టర్‌కు అభ్యంతరకర వార్తలు పంపిస్తున్నారో వాళ్లను ‘బ్లాక్’ చేయాలని నిర్ణయించుకున్నారామె. ‘‘నా ట్విట్టర్ పాజిటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఈ మాధ్యమం ద్వారా నాతో టచ్‌లో ఉండేవాళ్లు కూడా అలానే ఉండాలి. అలా లేనివాళ్లను బ్లాక్ చేసేస్తా’’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు అనుష్కా శర్మ. ఇది చదివిన అమితాబ్ బచ్చన్ ‘‘నన్ను బ్లాక్ చేసే ధైర్యం చేయకు... ఊరుకోను’’ అని ట్విట్టర్ ద్వారానే అనుష్కకు సరదాగా వార్నింగ్ ఇచ్చారు. అందుకు బదులుగా.. ‘‘అది జరగని పని సార్. జీవితంలో అలాంటి పని చేయను’’ అని అనుష్క పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement