
ముంబై : బాలీవుడ్ నటి అనుష్కశర్మను బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సరదాగా ఆటపట్టించాడు. సూయిదాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క.. కోస్టార్ వరుణ్ ధావన్‌తో అమితాబ్ ’కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌తో హాట్ సీట్‌లో కూర్చున్న అనుష్కను కోహ్లి ఫ్లయింగ్ కిస్ బిగ్‌బీ సరదాగా టీజ్ చేశాడు. కంటెస్టెంట్‌ను క్రికెట్ చూస్తారా అని అడగగా.. ఆమె తనకు అర్థం కాదని తెలిపారు. దీంతో వెంటనే బిగ్‌బీ అనుష్క చూస్తుంది తెలుసా అన్నాడు.
దీనికి అనుష్క మా భర్త క్రికెటర్ అని కంటెస్టెంట్‌కు వివరించే ప్రయత్నం చేసింది. దీనికి బిగ్‌బీ ‘ అనుష్కా.. నీవు కోహ్లి కోసమే క్రికెట్ చూస్తావా?’ అని ప్రశ్నించాడు. దీనికి లేదు..దేశం కోసం చూస్తానని అనుష్క స్పష్టం చేసింది. ఆ వెంటనే బిగ్‌బీ ‘ విరాట్ బ్యాట్ నుంచి నీకు వచ్చే ముద్దులను మేం చూస్తున్నాం’ అని ఆటపట్టించాడు. దీంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ ప్రొమో వైరల్ అయింది. ఇక మైదానంలో సెంచరీలు సాధించినప్పుడల్లా కోహ్లి తన సతీమణి అనుష్కకు బ్యాట్‌తో ముద్దులు ఇస్తూ అలరిస్తాడన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment