అనుష్కకు స్వీట్ షాక్! | Woah! Virat Kohli does it again! | Sakshi
Sakshi News home page

అనుష్కకు స్వీట్ షాక్!

Published Mon, Sep 21 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM

అనుష్కకు స్వీట్ షాక్!

అనుష్కకు స్వీట్ షాక్!

లవ్‌లో ఉన్నప్పుడు ప్రేమికులు ఒకరికి ఒకరు స్వీట్ షాక్‌లు ఇచ్చుకుంటుంటారు. ఇటీవల క్రికెటర్ విరాట్ కోహ్లి తన గాళ్ ఫ్రెండ్ అనుష్కా శర్మకు అలాంటి షాకే ఇచ్చారని సమాచారం. ఈ స్వీట్ షాక్‌కి వేదికగా నిలిచింది లండన్. అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’ షూటింగ్ అక్కడ జరుగుతోంది. ఆమె కోసం విరాట్ లండన్ వెళ్లాలనుకున్నారట. ఆ విషయాన్ని ముందుగానే అనుష్కతో చెప్పారట. కానీ, చెప్పినదానికన్నా ఒకరోజు ముందే లండన్‌లో తన ముందు ప్రత్యక్షమైన విరాట్‌ను చూసి, ఆనందంతో అనుష్క ఉబ్బితబ్బిబ్బయ్యారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement