నా కుక్కలనే ఢీ కొడతారా.. పోలీసులపై యువకుడు ఫైర్‌ | Hyderabad Pranay Argue With Police Video Viral | Sakshi
Sakshi News home page

నా కుక్కలనే ఢీ కొడతారా.. పోలీసులపై యువకుడు ఫైర్‌

Published Fri, Sep 1 2023 9:28 PM | Last Updated on Sun, Sep 3 2023 6:29 PM

Hyderabad Pranay Argue With Police Video Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ యువకుడు పోలీసులపై అ‍త్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో నడిరోడ్డుపై పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. నగరంలోని ఓల్డ్‌ ఎమ్మెల్యే ‍క్వార్టర్స్‌లో ప్రణయ్‌ యువకుడు తన రెండు కుక్కలతో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా పోలీసులు రోడ్లపై గస్తీ కాస్తున్నారు. ఈ సందర్భంగా కుక్కలకు పెట్రోలింగ్ కారు అడ్డుగా రావడంతో కుక్కలను ఢీకొట్టారంటూ ప్రణయ్ ఆగ్రహంతో పోలీసులను ఇష్టానుసారం దూషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement