Old MLA Quarters
-
నా కుక్కలనే ఢీ కొడతారా.. పోలీసులపై యువకుడు ఫైర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓ యువకుడు పోలీసులపై అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో నడిరోడ్డుపై పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. నగరంలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ప్రణయ్ యువకుడు తన రెండు కుక్కలతో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా పోలీసులు రోడ్లపై గస్తీ కాస్తున్నారు. ఈ సందర్భంగా కుక్కలకు పెట్రోలింగ్ కారు అడ్డుగా రావడంతో కుక్కలను ఢీకొట్టారంటూ ప్రణయ్ ఆగ్రహంతో పోలీసులను ఇష్టానుసారం దూషించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ పోలీసులపై యువకుడి బూతుపురాణం హైదరాబాద్ - ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పెట్రోలింగ్ కార్ నెంబర్-2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ చేస్తున్నారు. అదే టైంలో ప్రణయ్ తన 2 పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు. కుక్కలకు పెట్రోలింగ్ కారు… pic.twitter.com/VtJSAcqTnG — Telugu Scribe (@TeluguScribe) August 31, 2023 -
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్: జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ఉందని తెలిపారు. దొరలగడీ నుంచి బయటపడ్డానని, ఇంత అరాచకం ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. కాగా జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరనే నేపథ్యంలో జూపల్లిని సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం సోమవారం వెల్లడించింది. ఈ క్రమంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాట్లాడేందుకు జూపల్లి ప్రయత్నించగా.. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ప్రెస్‌మీట్ పెట్టేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులతో మాజీ మంత్రి వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ మాట్లాడతానంటూ జూపల్లి మైక్‌ల ముందుకొచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. బీర్ఎస్ పార్టీ రెండు, మూడేళ్లుగా సభ్యత్వం నమోదు చేసే బుక్స్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాను బీఆర్ఎస్లో ఉన్నట్లా? లేదా అనే అనుమానం ఉండేదన్నారు. బీఆర్ఎస్ బండారం బయటపడుతుందని భయపడి తనను సస్పెండ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. ‘తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశాను. వెయ్యి కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరని చెప్పాను. ఎందుకు సస్పెండ్ చేశారో కేసీఆర్ చెప్పాలి. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేది. సీఎం అంటే ధర్మకర్తగా పారదర్శక పాలన అందించాల్సిన బాధ్యత ఉంది. నాకు నచ్చిన్నట్లు పాలన చేస్తా అడగటానికి మీరెవరు అన్నట్లు కేసీఆర్ ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. చదవండి: ఖమ్మంవైపు తెలంగాణ రాజకీయాలు.. త్వరలో కొత్త పార్టీ? -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలో భారీ చోరీ జరిగింది. లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన హైదరాబాద్ హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగింది. దీనిపై పోలీసులు రహాస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు 305 ఫ్లాట్ కేటాయించారు. అయితే ఆ ఫ్లాట్‌లో ఎమ్మెల్యే బంధువు అమర్నాథ్ బాబు కుటుంబం కొంతకాలంగా నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లాట్‌లో దొంగతనానికి పాల్పడ్డారు. ఫ్లాట్‌లోకి వెళ్లిన దొంగలు 14.6 తులాల బంగారం, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఈ విషయంపై ఆబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, నారాయణగూడ సీఐ రమేశ్‌కుమార్ వివరాలు వెల్లడించకుండా చోరీపై గోప్యత పాటిస్తున్నారు. పోలీసులు పదుల సంఖ్యలో సెక్యూరిటీ ఉండే క్వార్టర్ట్స్‌లో చోరీ కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమర్నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో తమ డ్రైవర్ ఇంట్లో పలు వస్తువులు కూడా దొంగతనానికి గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేసిన తాళాలు వేసినట్లు ఉండడం, లోపలికి ఎవరూ రాకపోవడంతో ఇంటిదొంగ పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో పోలీసులు డ్రైవర్‌పై అనుమానిస్తున్నారు. ఈ క్వార్టర్స్ ఇటీవల కొత్తగా నిర్మించిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సూట్‌కేస్ కలకలం
హైదరాబాద్ : నగరంలోని హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో సూట్ కేస్ కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సూట్ కేస్ వదిలి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్కాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... పేకాట అడ్డా
టాస్క్‌ఫోర్స్ దాడుల్లో బట్టబయలు 52 మంది అరెస్టు దొరికిన వారిలో రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు రూ. 12 లక్షలు, 60 సెల్ఫోన్లు స్వాధీనం కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే పీఏ పర్యవేక్షణలో వ్యవహారం! హైదరాబాద్: ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన చోట వ్యసనాలు రాజ్యమేలుతున్నాయి.. ఎమ్మెల్యేలు నివాసముండే చోట విచ్చలవిడి ‘వ్యవహారాలు’ సాగిపోతున్నాయి. ఇప్పటికే ‘మందు’ బాబులకు అడ్డాగా మారిం దనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్... తాజాగా పేకాట కేంద్రంగా మారింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి చేసిన ఆకస్మిక దాడుల్లో ఈ వ్యవహారం బయటపడింది. పేకాట ఆడుతున్న 52 మందిని ఈ దాడుల్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 12 లక్షల నగదు, 60 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రిక్రియేషన్ ముసుగులో నడుస్తున్న పేకాట క్లబ్బులను రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల కింద మూసివేసింది. దీంతో ఈ జూదానికి అలవాటు పడినవారు కొత్త కొత్త అడ్డాలను వెతుక్కుంటున్నారు. కొందరైతే ఏకంగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే కొంత కాలం నుంచి గుట్టుగా పేకాట నిర్వహిస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 707, 708 ఫ్లాట్లలో పేకాట ఆడుతున్న 52 మందిని పట్టుకున్నారు. పేకాట రాయుళ్ల కోసం ఇక్కడ ప్రత్యేక భోజన ఏర్పాట్లు, ఆడేందుకు ప్రత్యేక కుర్చీలు సైతం ఏర్పాటు చేసి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ ఫర్నిచర్‌ను సైతం సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ ప్రాంతాలకు చెందిన ఆయా పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు పీఏగా పనిచేస్తున్న నర్సింహారెడ్డి, కేశవరెడ్డి అనే వ్యక్తుల పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరుగుతోందని సమాచారం. ఈ రెండు క్వార్టర్లలోని ప్రజా ప్రతినిధులు ఇటీవలే ఖాళీ చేయడంతో... పేకాట నడిపిస్తున్నారు. కాగా ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నారాయణగూడ పోలీసులకు అప్పగించామని, పట్టుబడినవారిలో రాజకీయ నేతలు, ప్రముఖులు ఉన్నారని డీసీపీ లింబారెడ్డి తెలిపారు. -
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పేకాటరాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్: హిమాయత్‌నగర్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్యార్టర్స్‌లో సోమవారం పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న పలువురు వీఐపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నట్టు సమాచారం. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. -
నేడు ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, సిటీబ్యూరో: శనివారం ఎల్బీస్టేడియంలో జరగనున్న సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. చోటుచేసుకోనున్న మార్పులివే.. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్టేడియం చుట్టుపక్కల ఆంక్షలు ఏఆర్పెట్రోల్ పంప్, పీజేఆర్ విగ్రహం చౌరస్తా మధ్య వాహనాలను అనుమతించరు అబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే వాహనాలను పీజేఆర్ విగ్రహం వైపు కాక ఎస్బీహెచ్ మీదుగా మళ్లిస్తారు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా మళ్లిస్తారు రాజ్‌మొహల్లా రోడ్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వచ్చే వాహనాలను సిమెట్రీ జంక్షన్ నుంచి మళ్లిస్తారు కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను కింగ్‌కోఠి క్రాస్‌రోడ్డు నుంచి తాజ్‌మహల్ మీదుగా పంపిస్తారు లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్‌నగర్ మీదుగా పంపిస్తారు పోలీస్ కంట్రోల్‌రూమ్ చౌరస్తా నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వాహనాలను అనుమతించరు పీవీ విగ్రహం, తెలుగుతల్లి, అప్పర్‌ట్యాంక్‌బండ్ మార్గాల మీదుగా పాస్ ఉన్నవారినే స్టేడియానికి అనుమతిస్తారు. మిగతా వారి రాకపోకలపై నిషేధం.