హిమాయత్‌నగర్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్యార్టర్స్లో సోమవారం పోలీసులు దాడులు చేశారు.
హైదరాబాద్: హిమాయత్‌నగర్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్యార్టర్స్లో సోమవారం పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న పలువురు వీఐపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన వారిలో మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నట్టు సమాచారం. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.