రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అతి వేగం, అజాగ్రత్త, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం నేరం. దీని వల్ల మనతోపాటు ఎదుటివాళ్ల ప్రాణాలను ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రోడ్డు భద్రతా చర్యలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, శిక్షలు విధించినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు. నాకెందుకులే అని నిర్లక్ష్యంగా ప్రయాణించి అనేక అనర్థాలకు కారణకులుగా మారుతున్నారు.
తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చెక్‌పోస్టు వద్ద అతివేగంగా వెళ్లడమే కాకుండా.. ఆపేందుకు ప్రయత్నించిన పోలీసుపై ఓ కారు దూసుకెళ్లింది. వివరాలు.. బుధవారం తెల్లవారు జామున ట్రాఫిక్ పోలీసులు చిలకలగూడ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అతివేగంతో వెళ్తున్న ఓకారు చెక్‌పోస్టు వద్ద హైస్పీడ్‌తో దూసుకొచ్చింది.
కారును గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ దానని ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మహేష్‌కు తీవ్ర గాయాలవ్వగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓవర్ స్పీడ్‌తో నడిపిన కారు డ్రైవర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు అతడిపై కఠిన చర్చలు తీసుకోవాలని కోరుతున్నారు.
Early hours of Wednesday, speeding vehicle didn't stop at #checkpost in #Chilakalaguda & instead rammed into @hydcitypolice constable Mahesh & sped past; he was shifted to a private hospital nearby & is thankfully said to be out of danger @ndtv @ndtvindia #TelanganaElections2023 pic.twitter.com/OY4fdxt4FE
— Uma Sudhir (@umasudhir) October 20, 2023
Comments
Please login to add a commentAdd a comment