
సాక్షి, హైదరాబాద్: కోఠి ప్రాంతంలో ఓ మహిళ హంగామా సృష్టించింది. సుల్తాన్ బజార్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించింది. కోఠిలోని బ్యాంక్ వీధిలో నో పార్కింగ్ వద్ద మహిళ తన కారు పార్క్ చేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె కారు వీల్‌కు తాళం వేసి చలానా విధించారు. ఇది గమనించిన మహిళ కారు వద్దకు వచ్చి.. తన కారుకు లాక్ ఎలా వేస్తారంటూ.. ట్రాఫిక్ పోలీసులపై వాగ్వాదానికి దిగింది.
లాక్ తీయాలంటూ ఎస్సై వాకీ టాకీ లాక్కొని హడావిడీ చేసింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కొ పట్టుకొని దుర్భాషలాడింది. అనంతరం సదరు మహిళ ప్రవర్తనపై ట్రాఫిక్ కానిస్టేబుల్ సుల్తాన్ బజార్ పోలీసులకు పిర్యాదు చేశారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment