sultan bazar
-
హైదరాబాద్‌లో మహిళ హంగామా.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో గొడవ
సాక్షి, హైదరాబాద్: కోఠి ప్రాంతంలో ఓ మహిళ హంగామా సృష్టించింది. సుల్తాన్ బజార్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించింది. కోఠిలోని బ్యాంక్ వీధిలో నో పార్కింగ్ వద్ద మహిళ తన కారు పార్క్ చేసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె కారు వీల్‌కు తాళం వేసి చలానా విధించారు. ఇది గమనించిన మహిళ కారు వద్దకు వచ్చి.. తన కారుకు లాక్ ఎలా వేస్తారంటూ.. ట్రాఫిక్ పోలీసులపై వాగ్వాదానికి దిగింది. లాక్ తీయాలంటూ ఎస్సై వాకీ టాకీ లాక్కొని హడావిడీ చేసింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కొ పట్టుకొని దుర్భాషలాడింది. అనంతరం సదరు మహిళ ప్రవర్తనపై ట్రాఫిక్ కానిస్టేబుల్ సుల్తాన్ బజార్ పోలీసులకు పిర్యాదు చేశారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
సాక్షి, సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యంవల్లే తమ కూతురు మృతి చెందిందని బాలింత కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఐదు గంటల పాటు ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితి నెలకుంది. పోలీసులు విచ్చ వైద్యులపై కేసు నమోదు చేయడంతో బాధితులు శాంతించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ లక్ష్మీనగర్‌కు చెందిన బాలకృష్ణ భార్య పూజ(25)కు నెలలు నిండడంతో మొదటి కాన్పు కోసం ఈ నెల 25వ తేదీ ఆదివారం 3 గంటల ప్రాంతంలో సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరి్పంచారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో పూజ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో బాలింతరాలు పూజ చనిపోయిందని చెప్పడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎలా చనిపోతుందంటూ కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశి్నంచారు. పూజకు డ్యూటీ వైద్యులు సరిగా కుట్లు వేయకపోవడంతోనే రక్తస్రావం ఎక్కువై మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా రెండో సారి వైద్యలు కుట్లు వేయడంతోనే పూజ మరణించిందని ఆందోళనకు దిగారు. తమ బిడ్డ వైద్యల నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆస్పత్రి ఎదుట ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు. అప్పుడే పుట్టిన చిన్నారని అనాథగా మారిందని కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కలచి వేసింది. సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఏసీపీ దేవేందర్ బంధువులకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు వైద్యులపై పోలీçసు కేసు నమోదు చేస్తామని బంధువులకు సర్దిజెప్పి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్‌చేసిన డ్యుటీ డాక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు. -
ప్రేమికుల కిడ్నాప్.. అడవుల్లో తిప్పుతూ చిత్రహింసలు!
సాక్షి, సుల్తాన్‌బజార్: ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకుందామని నగరానికి వచ్చిన ప్రేమజంటను అమ్మాయి తరపు బంధువులు కిడ్నాప్ చేసి ఇష్టానుసారంగా దాడి చేశారు. సుల్తాన్‌నగర్ పోలీసులు తెలిపిన మేరకు.. నారాయణపేట్‌జిల్లా బండగొండ గ్రామానికి చెందిన శివశంకర్‌గౌడ్(23), అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారు. దీంతో నగరంలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు.పెళ్లి చేసుకోవాలని భావించి ముందుగానే (ఈనెల 3)న నగరానికి వచ్చారు. గురువారం శివశంకర్, అతను ప్రేమించిన యువతి కాచిగూడ క్రాస్‌లో ఉన్న ఓ మాల్ సెల్లార్లో ఉండగా అమ్మాయి తరపు బంధువులు ఇద్దరిపై దాడిచేసి కారులోకి తీసుకెళ్లారు. సినీఫక్కీలో కిడ్నాప్.. చిత్రహింసలు సినిమాలో చూపించినట్లు ప్రేమికులను వారు కారులో ఇష్టానుసారం చితకబాదారు. సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ ముందు నుంచి వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ తీవ్ర చిత్రహింసలకు గురిచేసారు.ఈ దాడిలో శివశంకర్‌కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. సంగనూరుపల్లిలో శివశంకర్‌కు దుస్తులు మార్పించారు. ఆ తరువాత మద్దూరు పోలీసుస్టేషన్లో శివశంకర్‌ను అప్పగించి వారి అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లారు. సీసీ ఫుటేజి ఆధారంగా నిందితుల అరెస్ట్... యువతి స్నేహితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బడీచౌడి ఆర్యసమాజ్, కాచిగూడ బిగ్‌బజార్ వద్ద సీసీ ఫుటేజిని పరిశీలించారు. కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కారు ఓనర్ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు మద్దూర్ పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో అక్కడి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. శుక్రవారం తెల్లవారు జామున ఆరుగురు కిడ్నాపర్లు కోట్టం కష్ణారెడ్డి(43), కోట్టం శ్రీనివాస్‌రెడ్డి(23), జి.తిరుపతి(23), కె.శ్యాంరావురెడ్డి(27), కె.పవన్‌కుమార్‌రెడ్డి(21), పి.హరినాథ్‌రెడ్డి(29)లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: పెళ్లి చేసుకుందాం అన్నందుకు చున్నీని గొంతుకు బిగించి.. -
సుల్తాన్‌బజార్ సీఐ లక్ష్మణ్ కుటుంబానికి చేయూత
సాక్షి, హైదరాబాద్: 2009 బ్యాచ్ ఎస్సైలు మరోసారి తమ పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ బ్యాచ్‌మేట్ కుటుంబానికి చేయూతనందించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లోని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.లక్ష్మణ్ ఇటీవల నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లక్ష్మణ్ దంపతులిద్దరూ కన్నుమూశారు. లక్ష్మణ్ మృతితో ఆంధ్ర– తెలంగాణలో పనిచేస్తున్న అతని 2009 బ్యాచ్‌కి చెందిన 1,100 మంది పోలీసు అధికారులు స్పందించి రూ.35 లక్షలు పోగుచేశారు. గురువారం లక్ష్మణ్ దినకర్మలో అతని పిల్లలు ఆకాంక్ష, సహశ్‌కు ఆ డబ్బును అందజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న 2012 బ్యాచ్ ఎస్సైలు కూడా క్రిష్ణయ్య నేతృత్వంలో తమ వంతుగా రూ.4.5 లక్షలు సహాయం అందించారు. కార్యక్రమంలో 2009 బ్యాచ్ సొసైటీ సభ్యులు జి.శ్రీనివాస్, బి.ప్రమోద్, ఎస్కే లతీఫ్, బగ్గని శ్రీనివాస్, మందల రాజు పాల్గొన్నారు. -
ఏసీబీ చేతనతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
కోఠి మెటర్నిటీ హాస్పిటల్లో కిడ్నాపైన శిశువు క్షేమం
-
పసికందు దొరికింది
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి(కోఠి మెటర్నిటీ హాస్పిటల్) నుంచి సోమవారం అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభించింది. దాదాపు 28 గంటల పాటు నిర్విరామ గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందాలు మంగళవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని గుర్తించాయి. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. శిశువు పరిస్థితి నిలకడగా ఉందని, బుధవారం ఉదయానికి హైదరాబాద్ తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితురాలి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆయాగా పరిచయం.. అపహరణ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన సుబావతి విజయ కాన్పు కోసం గత నెల 21న సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. 27న వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో విజయ వద్దకు వచ్చిన ఓ గుర్తుతెలియని మహిళ ఆయాగా పరిచయం చేసుకుంది. చిన్నారికి వ్యాక్సినేషన్ చేయించాలని చెప్పి తనతో తీసుకెళ్లింది. ఆ మహిళ ఎంతకూ బిడ్డను తీసుకురాకపోవడంతో విజయకు అనుమానం వచ్చి కుటుంబీకులకు విషయం చెప్పింది. వారు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తర్వాత దాదాపు ఒంటి గంట ప్రాంతంలో రెండు ప్రత్యేక బృందాలు ప్రాథమికంగా ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితురాలిని గుర్తించాయి. చిన్నారిని తీసుకెళ్లిన మహిళ కదలికల కోసం ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న 200 సీసీ కెమెరాల ఫీడ్‌ను అధ్యయనం చేశాయి. ఈ నేపథ్యంలోనే సదరు మహిళ చిన్నారితోపాటు ఆటోలో ఎంజీబీఎస్‌కు వెళ్లినట్లు తేలింది. సీసీ కెమెరాల ఆధారంగా.. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మరో రెండు గంటల పాటు బస్టాండ్‌లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. సదరు కిడ్నాపర్ చిన్నారితోపాటు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఓ బస్సు ఎక్కుతున్న దృశ్యాలను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుర్తించగలిగారు. ఆ బస్సు ఎక్కడకు వెళ్తుందో తెలుసుకోవడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆర్టీసీ అధికారుల సాయంతో అది బీదర్ బస్సుగా నిర్థారించిన పోలీసులు దాని నంబర్ కోసం ప్రయత్నించారు. వీడియోల్లో స్పష్టంగా లేకపోవడంతో స్టేషన్ మాస్టర్ సాయంతో బస్సు నంబర్‌తో పాటు దాని డ్రైవర్ సెల్ నంబర్ సైతం సేకరించగలిగారు. సుల్తాన్‌బజార్ పోలీసులు ఆ డ్రైవర్‌కు కాల్ చేయగా.. సదరు మహిళ చిన్నారితోపాటు బీదర్ బస్సు స్టేషన్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో దిగిందని, తాము ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో ఉన్నామని చెప్పాడు. బీదర్‌కు ప్రత్యేక బృందాలు.. ఈ పరిణామాల నేపథ్యంలో ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేశ్ బీదర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడి నుంచీ మూడు ప్రత్యేక బృందాలు బీదర్ బయలుదేరాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు పాప ఫొటోలతో పాటు అనుమానితురాలి సీసీ ఫుటేజ్ తదితరాలను బీదర్ పోలీసులకు పంపారు. వీటి ఆధారంగా బీదర్ పోలీసులు అక్కడి బస్టాండ్ నుంచి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రికి నగరం నుంచి బయలుదేరిన పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు బీదర్ చేరుకున్నాయి. అప్పటికే బీదర్ పోలీసులు సదరు మహిళ చిన్నారితోపాటు బస్టాండ్ పక్కనే ఉన్న మురికివాడలోకి వెళ్లినట్లు సమాచారం సేకరించారు. బీదర్ పోలీసులతో కలసి ప్రత్యేక బృందాలు ఆ మురికివాడలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. తమ వద్ద ఉన్న చిన్నారి, అనుమానితురాలి ఫొటోలను ప్రజలకు చూపిస్తూ సమాచారం సేకరించాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. అయితే కిడ్నాపర్ చిన్నారితోపాటు ఆ మురికివాడ నుంచి తప్పించుకుంది. ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో.. తదుపరి చర్యల్లో భాగంగా మురికివాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్‌ను పరిశీలించారు. ఓ సీసీ కెమెరాలో అనుమానాస్పదంగా మహిళ కదలికలు రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఆమే కిడ్నాపర్ అని, చిన్నారితోపాటు ఓ ఆటో ఎక్కుతున్నట్లు గుర్తించారు. మరికొన్ని సీసీ కెమెరాల పరిశీలించిన అనంతరం సదరు మహిళ మూడు ఆటోలు మారినట్లు తేల్చారు. ఆటో నంబర్లు సరిగ్గా కనిపించకపోవడంతో సాంకేతికంగా ప్రయత్నించారు. చివరకు ఐదు ఆటోలను గుర్తించి వాటి డ్రైవర్లను విచారించారు. ఓ ఆటో డ్రైవర్ మంగళవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో తాను ఓ మహిళను, చిన్నారిని బీదర్ ప్రభుత్వాసుపత్రి సమీపంలో వదిలినట్లు చెప్పాడు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులకు.. ఓ మహిళ ఒంటి గంటల ప్రాంతంలో పసికందుతో వచ్చిందని, చిన్నారిని వదిలి పారిపోయిందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తాము పసికందును ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపాయి. ఫొటోలతో సరిపోల్చి.. తల్లికి చూపించి.. అక్కడకు చేరుకున్న సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన ఐసీయూలో ఉన్న చిన్నారిని ఫొటోలతో పోల్చి కిడ్నాపైన శిశువుగా గుర్తించారు. వీడియో కాల్ ద్వారా నగరంలో ఉన్న తల్లి విజయకు చిన్నారిని చూపించి ఖరారు చేసుకున్నారు. ప్రసుత్తం చిన్నారి అక్కడే చికిత్స పొంkదుతుండటంతో తల్లి విజయను సైతం అక్కడికి తీసుకువెళ్లారు. బుధవారం తల్లీబిడ్డల్ని నగరానికి తీసుకురానున్నారు. మరోవైపు పరారైన కిడ్నాపర్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆమె బీదర్‌కు చెందినదా లేదా అక్కడ బంధువులు ఉన్న మహిళై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో లేదా చుట్టు పక్కల ఒకటి రెండు రోజులు కాపుకాసి ఉండచ్చని అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు -
మంత్రి మేనల్లుళ్లు ఇల్లు వదిలి వచ్చారు...
► తప్పిపోయిన ముగ్గురు విద్యార్థులు కర్ణాటక మంత్రి మేనల్లుళ్లు ►మంత్రికి అప్పగించిన సుల్తాన్‌బజార్ పోలీసులు.. సుల్తాన్‌బజార్ : కర్ణాటక రాష్ట్రంలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను సుల్తాన్‌బజార్ పోలీసులు క్షేమంగా వారి సంబంధీకులకు అప్పగించారు. వివరాలు.. బీదర్‌కు చెందిన ప్రవీణ్ (9), కరణ్(8) వినీత్(10)ఇతర రాష్ట్రాలు చూడాలని డబ్బులు జమచేసుకుని గురువారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో తచ్చాడుతుండడంతో ఓ ఆటోడ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ముగ్గురిని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఆరా తీయగా తాము బీదర్‌కు చెందిన వారమని చెప్పారు. దీంతో సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ శివశంకర్‌రావు కర్ణాటక పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడి పోలీసులు తప్పిపోయిన వారు కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈశ్వర్ బీమన్న కంద్రా మేనళ్లులు అని తాము వారి గురించి తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు. అక్కడి పోలీసులు మంత్రికి సమాచారం అందించడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌కు చేరుకోవడంతో ఆయనకు చిన్నారులను అప్పగించారు. దీంతో ఆయన స్థానిక పోలీసులను అభినందించారు. -
సుల్తాన్ బజార్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని సుల్తాన్‌బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక హోటల్లో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో హోటల్ సమీపంలోని నాలుగు షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సుల్తాన్‌బజార్‌లో 41కిలోల గంజాయి స్వాధీనం
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్) : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 41 కిలోల గంజాయి, ఓ వ్యాగనార్ కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శివశంకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన అలకుంట్ల సాయిలు(49) నగరంలోని మౌలాలి ఉప్పర్గూడలో నివాసం ఉంటున్నాడు. విశాఖపట్టణం జిల్లా నుంచి గంజాయిని దొంగచాటుగా తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు. గురువారం వైజాగ్ నుంచి 41 కిలోల గంజాయిని తన కారులో తీసుకువచ్చి ఇసామియా బజార్‌లోని లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం వద్ద ఆపాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కారును తనిఖీ చేయగా అందులో 41 కిలోల గంజాయి దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సాయిలును రిమాండ్‌కు తరలించారు. -
‘ఆ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టండి’
హైదరాబాద్: సుల్తాన్‌బజార్‌లో ఇద్దరు అడ్డా కూలీల మృతికి కారణమైన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటనపైన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బోర్డు ఎండీ లోకేష్‌తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయి జాగ్రత్తలతో యంత్రాల సాయంతో డ్రైనేజీ శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంతో ప్రభుత్వానికి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలకు సాయం అందజేయాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. -
మెట్రోరైల్ భవన్ వద్ద సుల్తాన్ బజార్ వ్యాపారుల ధర్నా
మెట్రోరైలు నిర్మాణంతో తామంతా ఉపాధి కోల్పోతామని, అందువల్ల ఎలైన్మెంట్ మార్చాలని కోరుతూ సుల్తాన్ బజార్ వ్యాపారులు మెట్రోరైల్ భవన్ వద్ద ధర్నా చేశారు. సుల్తాన్ బజార్ మీదుగా మెట్రోరైలు వెళ్తే తామందరం వ్యాపారాలు వదులుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటికే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పాత పద్ధతిలోనే మెట్రో ఎలైన్మెంట్ ఉంటుందని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. సుల్తాన్ బజార్ వ్యాపారుల కోసం 2000 గజాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి సుల్తాన్‌బజార్ ప్రాంతాన్ని మినహాయించేందుకు అక్కడ అండర్‌గ్రౌండ్ సహా పలు రకాల ప్రత్యామ్నాయాలు చూశారు గానీ, అవేవీ పెద్దగా పనికిరాలేదు. దాంతో.. పాత పద్ధతిలోనే, అదే ఎలైన్మెంటుతో మెట్రోరైలును నిర్మించాలని నిర్ణయించారు. దానికి తగ్గట్లుగా ముందుగా పుత్లిబౌలిలోని పెట్రోలు బంకును కూడా కూల్చేశారు. -
సుల్తాన్ బజార్ వ్యాపారుల ధర్నా
-
సుల్తాన్‌బజార్‌లో చైన్‌స్నాచింగ్
-
సుల్తాన్‌బజార్‌లో చైన్‌స్నాచింగ్
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్) : నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన సోమవారం సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం కాటేదాన్‌కు చెందిన జయమ్మ(50) కోఠి 94 స్టాప్ మీదుగా ఈఎన్టి ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వెనుక నుంచి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు తెంపుకొని ఉడాయించారు. ఈ క్రమంలో ఆమె కిందపడి స్వల్ప గాయాలపాలైంది. దీంతో స్థానికులతో కలిసి సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రామ్‌కోఠిలో వ్యక్తి దారుణ హత్య
-
ఉస్మానియాలో పేషంట్ల తరలింపు ప్రారంభం
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి నుంచి పేషంట్ల తరలింపు ప్రక్రియ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆస్పత్రిలోని నాలుగు విభాగాలు జనరల్ మెడిసన్, జనరల్ సర్జరీ, సర్టకల్ గ్యాస్ర్టో , మెడికట్ గ్యాస్ర్టో విభాగాలను సుల్తాన్ బజార్ ప్రసూతి హాస్పటిల్ కు తరలించనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి అర్థోపెడిక్ విభాగాన్ని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలిస్తారు. మొత్తం 740 పడకలు సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రిలో కొనసాగనున్నాయి. ఈ సేవలు కేవలం ఏడాది పాటు అక్కడ కొనసాగతాయి. ఓపీ సేవలు యథాతథం కాగా ఉస్మానియాలోని అవుట్పేషంట్ (ఓపీ) తోపాటు ఎమర్జెన్సీ విభాగాలు యధావిధిగా కొనసాగుతాయని ఆస్పత్రి సూపరిండెంటెంట్ రఘు తెలిపారు. ఓపీ పేషంట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. -
ర్యాగింగ్ పేరిట శృతి మించొద్దు : ఏసీపీ గిరిధర్
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్) : ర్యాగింగ్‌ల పేరిట విద్యార్థులు తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోకూడదని సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్ సూచించారు. శుక్రవారం సుల్తాన్‌బజార్ హనుమాన్ టెకిడిలోని ప్రగతి మహా విద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ కౌన్సెలింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ గిరిధర్ హాజరై ర్యాగింగ్ వల్ల వచ్చే అనర్థాలపై విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు తమ సరదాల కోసం ర్యాగింగ్‌ల పేరిట శృతి మించిన ఆగడాలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. తోటి విద్యార్థులను స్నేహపూర్వకంగా కళాశాలలోకి ఆహ్వానించాలే తప్ప ర్యాగింగ్‌ల పేరుతో వికృతచేష్టలకు పాల్పడవద్దని హితవు పలికారు. కళాశాలల యాజమాన్యాలు సైతం ర్యాగింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. -
‘సెకండ్’ సెల్ఫోన్లు కొనుగోలు చేయొద్దు
చాదర్‌ఘాట్: సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్లను రసీదులు లేకుండా కొనుగోలు చేయవద్దని సుల్తాన్ బజార్ ఏసీపీ రావుల గిరిధర్ సూచించారు. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెకండ్‌హ్యాండ్ సెల్ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తప్పకుండా రసీదులు తీసుకోవాలన్నారు. ఒకవేళ రసీదులు లేకుండా కొనుగోలు చేస్తే, వాటి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు కొనుగోలుదారులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. సెల్ఫోన్లను కొందరు దొంగలించి తక్కువ ధరకు అమ్ముతూ వినియోగదార్లను ఆకర్షిస్తున్నరన్నారు. అలాగే ఆటోల్లో ప్రయాణించేప్పుడు తప్పనిసరిగా ఆటో నంబర్‌ను రాసుకోవటం లేదా గుర్తు పెట్టుకోవటం చేయాలన్నారు. ఇటీవల ఆటోల్లో ప్రయాణించే వారిపై దాడి చేసి నగదు, సెల్ఫోన్లు దోపిడీ చేస్తున్నందున ప్రజలకు ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు ఏసీపీ చెప్పారు. -
షాపింగ్ కు వెళ్లింది..తిరిగి రాలేదు..!
హైదరాబాద్ (సుల్తాన్‌బజార్ ) : షాపింగ్‌కు వెళ్లిన ఓ గృహిణి అదృశ్యం అయిన సంఘటన హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ బాల్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం... బేగంపేట్ రసూల్‌పూరా కృష్ణానగర్‌కు చెందిన పి.బాల్‌రాజ్ భార్య అనిత(30) తన బంధువులైన స్రవంతి, స్వాతి, మహేశ్వరిలతో కలిసి గురువారం కోఠికి షాపింగ్ కోసం వెళ్లారు. అయితే మధ్యలో అనిత కనబడకపోవడంతో వారు భర్త బాల్‌రాజ్‌కు సమాచారం అందించారు. భార్య సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా అది స్విచ్ఆఫ్లో ఉంది. భర్త ఇతర బంధువులతో కలిసి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో వెదికి, తెలిసినవారిని వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సుల్తాన్‌బజార్‌లో రూ.20 కోట్లు చోరీ
సుల్తాన్‌బజార్(హైదరాబాద్ క్రైం): నగరం నడిబోడ్డులో ఉన్నసుల్తాన్‌బజార్‌లో రూ.20 కోట్లు చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సుల్తాన్‌బజార్‌లోని కపాడియా ఛారీటబుల్ ట్రస్ట్‌లో భారీ చోరీ జరిగినట్లు నిర్వాహకుడు సుశీల్‌కుమార్ తెలిపారు. శనివారం ట్రస్ట్‌కు తాళం వేసి వెళ్లిన సుశీల్‌కుమార్ సోమవారం వచ్చి చూసి ఆఫీస్‌లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. ఈ చోరీలో ఆఫీస్‌లో ఉన్న రూ. 20 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, రూ.2.50 లక్షల నగదు, రెండు కంప్యూటర్లు, ఐదు బీరువాలు, కొంత పర్నీచర్ను దొంగలించారని నిర్వాహకుడు తెలిపాడు. అత ని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. -
కళ్లల్లో కారం చల్లి రూ 2.77 లక్షలు దోపిడీ
నల్లకుంట ఠాణా పరిధిలో ఘటన నల్లకుంట: బైక్‌పై వెళ్తున్న కలెక్షన్బాయ్ను గుర్తు తెలియని వ్యక్తులు తమ బైక్‌లతో ఢీకొట్టారు... కళ్లల్లో కారం చల్లి అతడి చేతిలో ఉన్న రూ. 2.77 లక్షల నగదు బ్యాగ్‌ను లాక్కొని ఉడాయించారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. తూర్పు మండలం అదనపు డీసీపీ ఎల్టీ. చంద్రశేఖర్ తెలిపిన వివరాలు... సీతాఫల్మండి మైలార్‌గడ్డ నివాసి చిప్ప రాజేందర్(38) ట్రూప్ బజార్‌లోని మారుతి ఎలక్ట్రికల్స్‌లో సేల్స్‌మెన్/ కలెక్షన్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 25, 26 తేదీల్లో వసూలు చేసిన డబ్బు రూ 2.77 లక్షలను కార్యాలయంలో అప్పగించకుండా తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచాడు. గురువారం తన వద్ద ఉన్న డబ్బును బ్యాగ్‌లో పెట్టుకుని సుల్తాన్ బజార్‌లోని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జమ చేసేందుకు ఉదయం 11.30కి ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. సరిగ్గా 11.45కి అడిక్‌మెట్ ఫ్లైఓవర్ సమీపంలోని లలితానగర్ గండిమైసమ్మ ఆలయం వీధి వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో రెండు బజాజ్ పల్సర్ బైక్‌లపై వచ్చిన నలుగురు యువకులు రాజేందర్ బైక్‌ను ఢీకొట్టారు. కిందపడిపోయిన రాజేందర్ చేతిలోని క్యాష్‌బ్యాగ్‌ను ఓ వ్యక్తి లాక్కోవడానికి ప్రయత్నించగా వదలలేదు. దీంతో వారు రాజేందర్ కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కుని పారిపోయారు. సమీపంలో ఉన్న ఓ మహిళతో పాటు అదే వీధిలో గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్న కొందరు యువకులు అడ్డుకునేందుకు యత్నించగా వారిని కూడా దుండగులు బెదిరించి పారిపోయారు. వెంటనే బాధితుడు నల్లకుంట ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సమాచారం తెలిసి తూర్పుమండలం అదనపు డీసీపీ చంద్రశేఖర్, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ లింబారెడ్డి, కోటిరెడ్డి, సీసీఎస్ డీసీపీ బాలరాజు నల్లకుంట స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితుడు రాజేందర్‌ను తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి మైలార్గడ్డలోని అతని ఇంటికి కూడా తీసుకెళ్లి విచారించారు. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లోని ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకొనేందుకు టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిసింది. ఘటనపై అనుమానాలు... బాధితుడు రాజేందర్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్టు, ఆ డబ్బును బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్తున్నట్టు దొంగలకు ఎలా తెలిసిందనేది అంతుబట్టడంలేదు. ఈ దోపిడీకి పాల్పడిన ముఠాకు రాజేందర్‌కు ఏమైనా సంబంధాలున్నాయా? లేక బిగ్ బజార్లో మాదిరిగానే ఇందులో కూడా తెలిసిన వారి హస్తం ఉందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. ఆరు రోజుల క్రితం సుల్తాన్‌బజార్‌లో నలుగురు దుండగులు రెండు పల్సర్ బైక్‌లపై వచ్చి రూ. 50 లక్షలు దోచుకెళ్లిన సంఘటన.., ఇప్పుడు నల్లకుంటలో జరిగిన దోపిడీ ఒకే విధంగా ఉన్నాయి. దీంతో ఈ దోపిడీ కూడా అదే ముఠా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
‘మెట్రో’పై 25న కీలక భేటీ
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో పనులపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు మరో పది రోజుల్లో తెరపడే అవకాశాలున్నాయి. చారిత్రక ప్రదేశాల్లో మెట్రో మార్గాన్ని భూగర్భానికి మళ్లించాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 25న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నగర మెట్రో ప్రాజెక్టు పనుల పురోగతి, ట్రయల్న్ ్రఏర్పాట్లు, భూగర్భ మార్గం సాధ్యాసాధ్యాలు ఇతర ఆర్థిక సంబంధిత అంశాలపై హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుల్తాన్‌బజార్, ఎంజే మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో భూగర్భ మెట్రో మార్గం సాధ్యాసాధ్యాలపై హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఇంజినీర్ల బృందం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించినట్టు తెలిసింది. నివేదికను ఈ నెల 25లోగా పూర్తిచేసి ఆర్థికశాఖకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సమాచారం. భూగర్భ మార్గం సాధ్యాసాధ్యాలను, అలైన్మెంట్ మారిస్తే భూసేకరణ బిల్లు ప్రకారం ఆస్తుల సేకరణ కష్టసాధ్యం కానుందని తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో ప్రాజెక్టు వ్యయం పెరిగితే భరించే స్థితిలో లేమని, ప్రభుత్వ పరంగా ఇతరత్రా రాయితీలిస్తేనే 3 కారిడార్లలో 72 కిలోమీటర్ల ప్రాజెక్టును 2017 జనవరి నాటికి పూర్తిచేయగలమని ఎల్ అండ్ టీ సంస్థ ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ఆర్థికశాఖకు విన్నవించనున్నట్టు తెలిసింది. ఆర్థికశాఖ మార్గదర్శకాలే కీలకం? మెట్రో రైలు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయకుంటే అన్ని రంగాల్లో పీపీపీ ప్రయోగం విఫలమౌతుందన్న సంకేతాలు వెలువడితే దేశవ్యాప్తంగా మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని కేంద్ర ఆర్థికశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), ఒప్పందపత్రం ప్రకారమే ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని పూర్తిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించనున్నట్టు సమాచారం. సుమారు రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు నిధి కింద రూ.1458 కోట్లు కేటాయించాల్సి ఉన్నందున ఆర్థికశాఖ మార్గదర్శకాలే రాష్ట్ర ప్రభుత్వానికి శిరోధార్యమయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
సుల్తాన్ బజార్ లో దొంగనోట్ల ముఠా అరెస్ట్
హైదరాబాద్: దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. నగరంలోని సుల్తాన్ బజార్ లో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగనోట్లు చెలామణి చేస్తున్నారనే ఫిర్యాదు అందుకున్న ఈస్ట్ జోన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1.30 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్ల ముఠాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
‘మెట్రో’ కారిడార్-2ను ఆపాలి
హైదరాబాద్: మెట్రోరైలు ప్రాజెక్టు కారిడార్-2ను ఆపాలని సామాజికవేత్త, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మేథాపాట్కర్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు. ఆప్ ఆధ్వర్యంలో ఆదివారం మెట్రోరైలు ప్రాజెక్టు కారిడార్-2ను ఆపాలని కోరుతూ కాచిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి బడీచౌడి, కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుల్తాన్‌బజార్‌లో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్ల చారిత్రాత్మక కట్టడాలైన ఆర్యసమాజ్, జైన్‌మందిర్, హనుమాన్ దేవాలయాలను కూల్చివేయాల్సి వస్తుందని తెలిపారు. దీంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువన్నారు. మెట్రోరైలు నిర్మాణం పేరిట ఎల్అండ్టీ కంపెనీ అవసరం లేకున్నా.. వేలకోట్ల రూపాయల విలువగల భూములను స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. చారిత్రాత్మకమైన కట్టడాలను ఉన్న చోట అండర్‌గ్రౌండ్ ద్వారా మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. గుజరాత్లో ప్రతి మూడు నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మొత్తం దేశంలో ఎలా కాపాడుగలుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయొద్దని ఆమె ప్రజలను కోరారు. కార్యక్రమంలో సామాజిక వేత్త సి.రామచంద్రయ్య, ఆప్ నేతలు సుమన్గుప్తా, సురేష్‌గోయల్, శశిభూషన్, రాజన్‌శర్మ, నీరజ్‌కుమార్, అలోఖ్, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.