పూజ మృతదేహాన్ని తరలిస్తున్న పోలీసులు, అనాథగా మారిన అప్పుడే పుట్టిన శిశువు
సాక్షి, సుల్తాన్‌బజార్: వైద్యుల నిర్లక్ష్యంవల్లే తమ కూతురు మృతి చెందిందని బాలింత కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఐదు గంటల పాటు ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితి నెలకుంది. పోలీసులు విచ్చ వైద్యులపై కేసు నమోదు చేయడంతో బాధితులు శాంతించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ లక్ష్మీనగర్‌కు చెందిన బాలకృష్ణ భార్య పూజ(25)కు నెలలు నిండడంతో మొదటి కాన్పు కోసం ఈ నెల 25వ తేదీ ఆదివారం 3 గంటల ప్రాంతంలో సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరి్పంచారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో పూజ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
అయితే వైద్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో బాలింతరాలు పూజ చనిపోయిందని చెప్పడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎలా చనిపోతుందంటూ కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశి్నంచారు. పూజకు డ్యూటీ వైద్యులు సరిగా కుట్లు వేయకపోవడంతోనే రక్తస్రావం ఎక్కువై మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా రెండో సారి వైద్యలు కుట్లు వేయడంతోనే పూజ మరణించిందని ఆందోళనకు దిగారు. తమ బిడ్డ వైద్యల నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆస్పత్రి ఎదుట ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు.
అప్పుడే పుట్టిన చిన్నారని అనాథగా మారిందని కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కలచి వేసింది. సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతి, ఏసీపీ దేవేందర్ బంధువులకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు వైద్యులపై పోలీçసు కేసు నమోదు చేస్తామని బంధువులకు సర్దిజెప్పి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్‌చేసిన డ్యుటీ డాక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment