సుల్తాన్‌బజార్ (హైదరాబాద్) : ర్యాగింగ్‌ల పేరిట విద్యార్థులు తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోకూడదని సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్ సూచించారు. శుక్రవారం సుల్తాన్‌బజార్ హనుమాన్ టెకిడిలోని ప్రగతి మహా విద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ కౌన్సెలింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ గిరిధర్ హాజరై ర్యాగింగ్ వల్ల వచ్చే అనర్థాలపై విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు తమ సరదాల కోసం ర్యాగింగ్‌ల పేరిట శృతి మించిన ఆగడాలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. తోటి విద్యార్థులను స్నేహపూర్వకంగా కళాశాలలోకి ఆహ్వానించాలే తప్ప ర్యాగింగ్‌ల పేరుతో వికృతచేష్టలకు పాల్పడవద్దని హితవు పలికారు. కళాశాలల యాజమాన్యాలు సైతం ర్యాగింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
ర్యాగింగ్ పేరిట శృతి మించొద్దు : ఏసీపీ గిరిధర్
Published Fri, Jul 3 2015 7:04 PM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM
Advertisement