నగరం నడిబోడ్డులో ఉన్నసుల్తాన్‌బజార్‌లో రూ.20 కోట్లు చోరీ జరిగింది.
సుల్తాన్‌బజార్(హైదరాబాద్ క్రైం): నగరం నడిబోడ్డులో ఉన్నసుల్తాన్‌బజార్‌లో రూ.20 కోట్లు చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సుల్తాన్‌బజార్‌లోని కపాడియా ఛారీటబుల్ ట్రస్ట్‌లో భారీ చోరీ జరిగినట్లు నిర్వాహకుడు సుశీల్‌కుమార్ తెలిపారు. శనివారం ట్రస్ట్‌కు తాళం వేసి వెళ్లిన సుశీల్‌కుమార్ సోమవారం వచ్చి చూసి ఆఫీస్‌లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. ఈ చోరీలో ఆఫీస్‌లో ఉన్న రూ. 20 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, రూ.2.50 లక్షల నగదు, రెండు కంప్యూటర్లు, ఐదు బీరువాలు, కొంత పర్నీచర్‌ను దొంగలించారని నిర్వాహకుడు తెలిపాడు. అత ని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.