‘ఆ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టండి’ | minister KTR respond on workers killed in sultan bazar | Sakshi
Sakshi News home page

‘ఆ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టండి’

Published Mon, May 2 2016 7:36 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

minister KTR  respond on workers killed in sultan bazar

హైదరాబాద్: సుల్తాన్‌బజార్‌లో ఇద్దరు అడ్డా కూలీల మృతికి కారణమైన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటనపైన హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్ బోర్డు ఎండీ లోకేష్‌తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయి జాగ్రత్తలతో యంత్రాల సాయంతో డ్రైనేజీ శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంతో ప్రభుత్వానికి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలకు సాయం అందజేయాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement