workers killed
-
ఆయువు తీసిన వాయువు.. తోటి కార్మికుడు ఎంతకూ బయటకు రాకపోవడంతో..
పరవాడ (పెందుర్తి): విశాఖ జిల్లా పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో రాంకీ ఇంటర్మీడియట్ పంప్ హౌస్ వద్ద ఆదివారం రాత్రి విష వాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పాయకరావుపేటకు చెందిన మణికంఠ(22), తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన అన్నంరెడ్డి దుర్గాప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 10.05 గంటల సమయంలో దుర్గాప్రసాద్ పంప్ హౌస్ లోపలికి వెళ్లి మ్యాన్ హోల్ తెరవగా.. వాల్వ్ నుంచి అధిక మొత్తంలో విష వాయువులు లీకై గది నిండా వ్యాపించాయి. దీంతో దుర్గాప్రసాద్ ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. అతడు ఎంతకీ బయటకు రాకపోవడంతో మణికంఠ గది లోపలికి వెళ్లాడు. అతను కూడా విష వాయువులను పీల్చడంతో ఊపిరాడక పడిపోయాడు. ఇద్దర్నీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మరణించారు. రాంకీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.27 లక్షల చొప్పున పరిహారం, దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేల చొప్పున చెల్లించేందుకు రాంకీ యాజమాన్యం అంగీకరించింది. -
ఆదిలాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, ఆదిలాబాద్: భీంపూర్ మండలం పిప్పల్‌కోటి క్యాంప్ ఆఫీస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలు అంటుకొని ఇద్దరు కార్మికులు మృతిచెందారు. పలు వాహనాలకు అగ్నికీలలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మూడు టిప్పర్లు, ప్రొక్లైన్ దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. చదవండి: కరోనా తెచ్చిన కష్టం; ఊరి చివర గుడిసె.. ఒంటరిగా బాలిక అడవి బిడ్డలపై దాడి అత్యంత హేయం: భట్టి విక్రమార్క -
మొక్కజొన్న ఫ్యాక్టరీలో పేలుడు
పెనుబల్లి: మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందారు. సుమారు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం పంచాయతీ పరిధిలోని నాయకులగూడెం సమీపంలో గల మొక్కజొన్న ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సత్తుపల్లికి చెందిన వ్యాపారి ఎలినేని మురళీకృష్ణ నాయకులగూడెంలో నెల రోజుల క్రితం మొక్కజొన్న ఫ్యాక్టరీని ప్రారంభించారు. మొక్కజొన్న కంకుల నుంచి విత్తనాలు వేరు చేసి.. బెండ్లను బాయిలర్‌లో వేడి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బాయిలర్ ద్వారా వచ్చిన ఆవిరితో విత్తనాలను శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి రవాణా చేస్తారు. ఈ క్రమంలో బాయిలర్ వద్ద పీడనం పెరిగి భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందగా.. ఆరు నుంచి పది మంది వరకు తీవ్ర గాయాల య్యాయి. పేలుడు తీవ్రతకు కార్మికులు 10 నుంచి 20 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయారు. మృతదేహాలు మాత్రం భయానక పరిస్థితిలో పడి ఉన్నాయి. క్షతగాత్రులను సత్తుపల్లి, పెనుబల్లి ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా.. పేలుడు రాత్రి 7 గంటల సమయంలో చోటుచేసుకోగా.. అప్పటికే కొందరు కార్మికులు విధుల నుంచి ఇళ్లకు వెళ్లడంతో ప్రాణనష్టం సంభవించలేదు. పేలుడుతో ఫ్యాక్టరీలోని సగ భాగం, ప్రహరీ కూలిపోయింది. పరిసరాల్లోని కార్లు, లారీల అద్దాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎవరినీ గుర్తించలేని పరిస్థితి ఉంది. కాగా.. బిహార్‌కు చెందిన కార్మికులతోపాటు స్థానికులు ఇందులో పనిచేస్తున్నారు. మృతులు ఎవరనేది ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. -
పాక్ గనుల్లో ప్రమాదం: 18 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో శనివారం రెండు వేర్వేరు బొగ్గు గనులు కూలిపోయిన దుర్ఘటనల్లో 18 మంది మృతిచెందారు. ఆరుగురు గాయపడ్డారు. తొలుత ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు సమీపంలోని మార్వార్ ప్రాంతంలో గ్యాస్ పేలుడు వల్ల బొగ్గు గని కూలిపోవడంతో 16 మంది చనిపోయారని, నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరో కార్మికుడు లోపల చిక్కుకున్నట్లు వెల్లడించారు. పాకిస్తాన్ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న బొగ్గు గనిలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, ఇద్దరు గాయాలపాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని కాపాడేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. -
ట్రాక్టర్ ఢీకొని కార్మికుడి మృతి
వి.సావరం(రాయవరం) : ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకుని వచ్చేందుకు వెళ్తున్న బట్టీ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో ఉందుర్తి సత్యనారాయణ (50) అనే బట్టీ కార్మికుడు మృతి చెందగా, మోర్త మహేష్ అనే మరో కార్మికుడు తీవ్రగాయాల పాలైన ఘటన శనివారం వి.సావరంలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిందిలా.. అమలాపురం మండలం సామంకుర్రుకు చెందిన ఉందుర్తి సత్యనారాయణ, మండలంలోని పసలపూడికి చెందిన మోర్త మహేష్‌లు కుటుంబ సభ్యులతో పనిచేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకునేందుకు మహేష్, సత్యనారాయణ కలిసి మోటార్‌సైకిల్‌పై రాయవరం బయలుదేరాడు. బట్టీకి కొద్ది అడుగుల దూరంలోనే వీరు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను రాయవరం నుంచి వెదురుపాక వైపుకు వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోగా, గాయాలపాలైన మహేష్‌ను 108 వాహనంపై రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే మృతుడు సత్యనారాయణ రెండేళ్లుగా బట్టీలో పనిచేస్తున్నాడు. సత్యనారాయణ భార్య మరియమ్మతో కలిసి బట్టీలో పనిచేసుకుంటుండగా, కుమారుడు, కుమార్తె వారి స్వగ్రామంలో నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్సై వెలుగుల సురేష్ సంఘటనా స్థలికి వచ్చి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్ తెలిపారు. దేవుడా ఎంతపనిచేశావు.. సరుకులు తెస్తానని చెప్పిన నా భర్తను నీ దగ్గరకే తీసుకుని పోయావా..దేవుడా ఎంత పని చేశావంటూ మృతుడు భార్య మరియమ్మ బోరున విలపించింది. బయటకు వెళ్లక పోయినా ప్రాణాలు దక్కి ఉండేవని, ఎంతపని జరిగిందంటూ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: ఎమ్మెల్యే గోపిరెడ్డి
గుంటూరు : ఫిరంగిపురం కొండల్లో మైనింగ్ బ్లాస్ట్‌లో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం క్వారీలో శనివారం మధ్యాహ్నం అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో.. కొండ చరియలు, రాళ్లు, మట్టిపెళ్లలు మీదపడి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు దుర్గాంజనేయులు, చిన్న బాలశౌరి, నాగేశ్వరరావు, రాయప్ప, శరవణలుగా గుర్తించారు. నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి... మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనా స్థలాన్ని పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి,క్రిస్టినా తదితరులు సందర్శించి, ఘటనపై ఆరా తీశారు. -
క్వారీలో బ్లాస్టింగ్: భారీగా ప్రాణ నష్టం
-
క్వారీలో బ్లాస్టింగ్: భారీగా ప్రాణ నష్టం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం మైనింగ్ క్వారీలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో బండరాళ్లు మీదపడి బండరాళ్లు పడి ఆరుగురు కూలీలు మృతిచెందారు. మరొ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వారీ ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, రూరల్ ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అక్రమ పేలుళ్ల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్వారీ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి: ఫిరంగిపురం క్వారీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఘటనాస్థలికి వెళ్లాలని మంత్రులు ప్రత్తిపాటి, దేవినేనిలకు సూచించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ ఘటనాస్థలికి బయల్దేరారు. -
భవంతి కూలిపోయి ఘోర ప్రమాదం
-
భవంతి కూలిపోయి ఘోర ప్రమాదం
∙ఫిలింనగర్‌క్లబ్ ఘటనలో ఇద్దరు మృతి ∙మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరిన 18 మంది కూలీలు అంతా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల నుంచి నగరానికి వలస వచ్చారు. మియాపూర్, ఖైరతాబాద్ చింతల్‌బస్తీల్లో అద్దెకుంటున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 8.30 గంటలకు ఫిలింనగర్ క్లబ్ పోర్టికో నిర్మాణ పనుల్లో చేరారు. శనివారం రాత్రి ఇంటికి చేరకుండా పనుల్లో మునిగిపోయారు.పోర్టికో పని పూర్తయితే ఇంటికి వెళ్లిపోవచ్చుననుకున్నారు. కొందరు కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్నారు. కానీ క్షణాల్లో ప్రమాదం జరిగింది. అంతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా పోర్టికో పిల్లర్లు కూలిపోయాయి. దాంతో శ్లాబ్ నేలమట్టమైంది. శ్లాబ్‌పైనే పని చేస్తున్న 10 మంది కూలీల్లో రాయచూరుకు చెందిన మాన్‌శేష్ అలియాస్ ఆనంద్(38), కోల్‌కతాకు చెందిన అనిసూర్ షేక్(40) అక్కడిక్కడే మృతి చెందారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్రీనివాస్(29), కర్ణాటకకు చెందిన శివ(31) తీవ్రం గా గాయపడ్డారు. శ్రీనివాస్‌కు దవడ ఎముకలు విరిగాయి. శివకు తలకు బలమైన గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ కర్ణాటకకు చెందిన మల్లేశం,సీతారాం, బీరప్ప,పశ్చిమబెంగాల్‌కు చెందిన అజిత్ బిశ్వాస్,సాహెబ్‌మండల్, ప్రకా శం జిల్లాకు చెందిన కోటేశ్వర్రావుకు చికిత్స చేసి ఇంటికి పంపించారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్, శివలను అపోలో ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. శివకు తల పగలడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
‘ఆ కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టండి’
హైదరాబాద్: సుల్తాన్‌బజార్‌లో ఇద్దరు అడ్డా కూలీల మృతికి కారణమైన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సంఘటనపైన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బోర్డు ఎండీ లోకేష్‌తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయి జాగ్రత్తలతో యంత్రాల సాయంతో డ్రైనేజీ శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంతో ప్రభుత్వానికి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలకు సాయం అందజేయాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.