గుంటూరు : ఫిరంగిపురం కొండల్లో మైనింగ్ బ్లాస్ట్‌లో మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం క్వారీలో శనివారం మధ్యాహ్నం అక్రమ బ్లాస్టింగ్ చేపట్టడంతో.. కొండ చరియలు, రాళ్లు, మట్టిపెళ్లలు మీదపడి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు దుర్గాంజనేయులు, చిన్న బాలశౌరి, నాగేశ్వరరావు, రాయప్ప, శరవణలుగా గుర్తించారు.
నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి... మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనా స్థలాన్ని పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి,క్రిస్టినా తదితరులు సందర్శించి, ఘటనపై ఆరా తీశారు.