ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో శనివారం రెండు వేర్వేరు బొగ్గు గనులు కూలిపోయిన దుర్ఘటనల్లో 18 మంది మృతిచెందారు. ఆరుగురు గాయపడ్డారు. తొలుత ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు సమీపంలోని మార్వార్ ప్రాంతంలో గ్యాస్ పేలుడు వల్ల బొగ్గు గని కూలిపోవడంతో 16 మంది చనిపోయారని, నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
మరో కార్మికుడు లోపల చిక్కుకున్నట్లు వెల్లడించారు. పాకిస్తాన్ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న బొగ్గు గనిలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, ఇద్దరు గాయాలపాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని కాపాడేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment