గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్) : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 41 కిలోల గంజాయి, ఓ వ్యాగనార్ కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన అలకుంట్ల సాయిలు(49) నగరంలోని మౌలాలి ఉప్పర్‌గూడలో నివాసం ఉంటున్నాడు.
విశాఖపట్టణం జిల్లా నుంచి గంజాయిని దొంగచాటుగా తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు. గురువారం వైజాగ్ నుంచి 41 కిలోల గంజాయిని తన కారులో తీసుకువచ్చి ఇసామియా బజార్‌లోని లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం వద్ద ఆపాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కారును తనిఖీ చేయగా అందులో 41 కిలోల గంజాయి దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సాయిలును రిమాండ్‌కు తరలించారు.