
నల్లచెరువు: శ్రీసత్యసాయి జిల్లా, నల్లచెరువు మండలం, పెద్దయల్లంపల్లి వద్ద శనివారం రాత్రి 13 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రరెడ్డి ఆదేశాల మేరకు పెద్దయల్లంపల్లి జాతీయరహదారిపై అటవీశాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మదనపల్లి నుంచి కదిరి వెళ్తున్న కారును గుర్తించారు.
అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారని గమనించిన ఇద్దరు దుండగులు కొద్దిదూరంలో కారు ఆపి పరారయ్యారు. అధికారులు కారును తనిఖీ చేయగా.. 13 ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ రూ.2 లక్షలకు పైగానే ఉంటుందని తెలిపారు. వాహనం నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తనిఖీల్లో డిప్యూటీ రేంజ్ అధికారి రామచంద్ర నాయక్, సెక్షన్ అధికారి రామచంద్రారెడ్డి, ఎఫ్‌బీఓలు నాగరాజు, హరిప్రసాద్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment