Red Sandal Logs
-
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నల్లచెరువు: శ్రీసత్యసాయి జిల్లా, నల్లచెరువు మండలం, పెద్దయల్లంపల్లి వద్ద శనివారం రాత్రి 13 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రరెడ్డి ఆదేశాల మేరకు పెద్దయల్లంపల్లి జాతీయరహదారిపై అటవీశాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మదనపల్లి నుంచి కదిరి వెళ్తున్న కారును గుర్తించారు.అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారని గమనించిన ఇద్దరు దుండగులు కొద్దిదూరంలో కారు ఆపి పరారయ్యారు. అధికారులు కారును తనిఖీ చేయగా.. 13 ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ రూ.2 లక్షలకు పైగానే ఉంటుందని తెలిపారు. వాహనం నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తనిఖీల్లో డిప్యూటీ రేంజ్ అధికారి రామచంద్ర నాయక్, సెక్షన్ అధికారి రామచంద్రారెడ్డి, ఎఫ్‌బీఓలు నాగరాజు, హరిప్రసాద్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
శేషాచలంలో కాల్పుల మోత
* కూంబింగ్‌లో ఎదురుపడిన కూలీలు * పోలీసులపై రాళ్లవర్షం, గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు * అదుపులోకి ఐదుగురు చంద్రగిరి: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మరోసారి కాల్పుల మోత మోగింది. 70 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఐదుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలను ఎస్ఐ భాస్కర్ తెలిపారు. చంద్రగిరి మండలంలోని అనంత గుర్రప్పగారిపల్లి దళితవాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున సుమారు 30 మంది పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో జెర్రిబండ వద్ద ఎర్రకూలీలు సుమారు 70 మంది సేదదీరుతూ వంట చేసుకోవడాన్ని పోలీసులు గమనించారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి మోహరించారు. పోలీసులను గమనించిన కూలీలు వారిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. కూలీలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన రామరాజన్, గోవిందన్, మురుగన్, విమల్, గోవిందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
స్మగ్లర్లు అరెస్ట్ : రూ. 60 లక్షల ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి : చంద్రగిరి మండలం ముంగళిపట్టు అటవీ ప్రాంతంలో శనివారం టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ. 60 లక్షలు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు.