
మంత్రి మేనల్లుళ్లు ఇల్లు వదిలి వచ్చారు...
కర్ణాటక రాష్ట్రంలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను సుల్తాన్‌బజార్ పోలీసులు క్షేమంగా వారి సంబంధీకులకు అప్పగించారు.
► తప్పిపోయిన ముగ్గురు విద్యార్థులు కర్ణాటక మంత్రి మేనల్లుళ్లు
►మంత్రికి అప్పగించిన సుల్తాన్‌బజార్ పోలీసులు..
సుల్తాన్‌బజార్ : కర్ణాటక రాష్ట్రంలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను సుల్తాన్‌బజార్ పోలీసులు క్షేమంగా వారి సంబంధీకులకు అప్పగించారు. వివరాలు.. బీదర్‌కు చెందిన ప్రవీణ్ (9), కరణ్(8) వినీత్(10)ఇతర రాష్ట్రాలు చూడాలని డబ్బులు జమచేసుకుని గురువారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో తచ్చాడుతుండడంతో ఓ ఆటోడ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ముగ్గురిని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఆరా తీయగా తాము బీదర్‌కు చెందిన వారమని చెప్పారు.
దీంతో సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రావు కర్ణాటక పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడి పోలీసులు తప్పిపోయిన వారు కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈశ్వర్ బీమన్న కంద్రా మేనళ్లులు అని తాము వారి గురించి తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు. అక్కడి పోలీసులు మంత్రికి సమాచారం అందించడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌కు చేరుకోవడంతో ఆయనకు చిన్నారులను అప్పగించారు. దీంతో ఆయన స్థానిక పోలీసులను అభినందించారు.