మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. పూటుగా మద్యం సేవించిన రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వైన్‌షాప్ ముందు సోమవారం చోటుచేసుకుంది. వైన్స్‌లో మద్యం సేవించిన ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి, అది తీవ్ర స్థాయికి చేరుకొని దాడులకు దారితీసింది